Side Effects of AC: ఏసీలో ఎక్కువ సేపు ఉంటున్నారా.. వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో మీకు తెలుసా?

ఇప్పుడు ఇంట్లో ఏసీ కూడా నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఏసీ ఉండటం కామన్ గా భావిస్తున్నారు. ఆఫీసుల్లో.. కారులో.. ఇంట్లో.. రెస్టారెంట్స్.. హోటల్స్ ఇలా చాలా చోట్ల ఏసీ ఉండటం సాధారణంగా. అయితే ఏసీలో ఎక్కువ సేపు గడపడం వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయట. ఇది శరీరానికి చల్ల గాలిని అందిస్తుంది కానీ.. ఏసీ గాలిని ఎక్కువగా పీల్చడం వల్ల వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా చిన్న పిల్లలకు అయితే శ్వాస, చర్మ సమస్యలు వస్తాయి. అంతే కాకుండా పెద్ద వారికి..

Side Effects of AC: ఏసీలో ఎక్కువ సేపు ఉంటున్నారా.. వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో మీకు తెలుసా?
Side Effects Of Ac

Edited By:

Updated on: Nov 30, 2023 | 7:25 PM

ఇప్పుడు ఇంట్లో ఏసీ కూడా నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఏసీ ఉండటం కామన్ గా భావిస్తున్నారు. ఆఫీసుల్లో.. కారులో.. ఇంట్లో.. రెస్టారెంట్స్.. హోటల్స్ ఇలా చాలా చోట్ల ఏసీ ఉండటం సాధారణంగా. అయితే ఏసీలో ఎక్కువ సేపు గడపడం వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయట. ఇది శరీరానికి చల్ల గాలిని అందిస్తుంది కానీ.. ఏసీ గాలిని ఎక్కువగా పీల్చడం వల్ల వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా చిన్న పిల్లలకు అయితే శ్వాస, చర్మ సమస్యలు వస్తాయి. అంతే కాకుండా పెద్ద వారికి కూడా పలు దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏసీలో ఎక్కువ సేపు ఉండటం వల్ల వచ్చే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాడీ పెయిన్స్:

ఏసీలో ఎక్కువ సేపు ఉండటం, ఆ గాలి పీల్చడం వల్ల బాడీ పెయిన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా శరీరం తిమ్మిరి అనుభూతి కూడా చెందుతుందట. ఏసీలో ఉన్నప్పుడు కీళ్లు నొప్పులు నొప్పులు వస్తున్నాయంటే.. దానికి దూరంగా ఉండాలని అర్థం చేసుకోండి. అంతే కాకుండా నడుము నొప్పి కూడా ఎక్కువగా వస్తుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి.

డీహైడ్రైట్ అయ్యే అవకాశం ఉంది:

ఏసీలో ఎక్కవు సేపు ఉండటం వల్ల చల్లగా ఉంటుంది. దీంతో చెమట ఎక్కువగా పట్టదు. ఈ కారణంగా దాహం ఎక్కువగా వేయదు. నీటిని తక్కువగా తీసుకుంటారు. ఈ కారణంగా బాడీ డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

వికారం – తల నొప్పి:

ఏసీ వేసినప్పుడు.. బయట గాలి లోపలికి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. దీని వల్ల అక్కడున్న గాలిని పీల్చడం వల్ల వికారం వస్తుంది. దీనివల్ల వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంది. అంతే కాకుండా తల నొప్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తల నొప్పితో బాధ పడేవారు ఏసీకి దూరంగా ఉండటం చాలా బెటర్.

చర్మం పొడి బారిపోతుంది:

ఏసీలో ఉండటం వల్ల చల్లగా ఉంటుంది. ఈ చల్లదనం వల్ల చర్మం త్వరగా పొడి బారిపోతుంది. దీంతో డల్ గా కనిపిస్తారు. అంతే కాకుండా నీటిని కూడా తక్కువగా తీసుకుంటారు కాబట్టి.. రక్త ప్రసరణ ఎక్కువగా జరగదు. దీంతో శరీరంలో తేమను కోల్పోతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.