Incense Sticks Benefits: ప్రతిరోజూ అగరుబత్తీలు వెలిగిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
పూజలో అగరు బత్తీలు కూడా ఒకటి. పూజలో కావాల్సిన ముఖ్యమైన వస్తువల్లో ఇవి కూడా ఒకటి. అగరు బత్తీల్లో ఎన్నో రకాలు ఉంటాయి. అలాగే ధరలు కూడా ఉంటాయి. ఎవరికి నచ్చినవి వారు కొంటూ ఉంటారు. అయితే వారానికో లేక ఎప్పుడు పూజ చేస్తారో అప్పుడే అగరు బత్తీలను వెలిగిస్తారు. కానీ ప్రతి రోజూ ఇంట్లో అగరు బత్తీలను వెలిగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఇటీవల చేసిన పలు అధ్యయనాల్లో తేలింది. అగరు బత్తీల నుంచి వచ్చే పొగ వాసన కారణంగా..

పూజలో అగరు బత్తీలు కూడా ఒకటి. పూజలో కావాల్సిన ముఖ్యమైన వస్తువల్లో ఇవి కూడా ఒకటి. అగరు బత్తీల్లో ఎన్నో రకాలు ఉంటాయి. అలాగే ధరలు కూడా ఉంటాయి. ఎవరికి నచ్చినవి వారు కొంటూ ఉంటారు. అయితే వారానికో లేక ఎప్పుడు పూజ చేస్తారో అప్పుడే అగరు బత్తీలను వెలిగిస్తారు. కానీ ప్రతి రోజూ ఇంట్లో అగరు బత్తీలను వెలిగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఇటీవల చేసిన పలు అధ్యయనాల్లో తేలింది. అగరు బత్తీల నుంచి వచ్చే పొగ వాసన కారణంగా.. ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. ఈ సుగంధ ద్రవ్యాల్లో క్యాన్సర్‌కు కారణం అయ్యే జెనోటాక్సిన్ రసాయనాలు ఉంటాయి. దీని వల్ల ఇంట్లో లేదా ఇంటి లోపల ఆర్గానిక్ అగర్ బత్తీని ఉపయోగించవచ్చు. దీంతో మనసు, శరీరం రెండూ బాగుంటాయి. వీటిని ప్రతి రోజూ ఇంట్లో వెలిగించడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఒత్తిడి తగ్గుతుంది:
చాలా మంది ప్రస్తుతం ఒత్తిడికి అధికంగా గురవుతున్నారు. ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో అగరు బత్తీలు వెలిగించడం వల్ల మనసుకు ప్రశాంత కలుగుతుంది. ఇది అరోమా థెరపీలో ఒక భాగంగా చెప్తారు. అగరు బత్తీల వాసన ఏ వ్యక్తిలోనైనా.. ఆందోళన, ఒత్తిడిని దూరం చేస్తుంది.
నిద్ర చక్కగా పడుతుంది:
అగరు బత్తీలు కాల్చడం వల్ల నిద్ర కూడా చక్కగా పడుతుంది. నిద్రపోయే గంట ముందు మీ బెడ్ రూమ్‌లో అగరు బత్తీలను వెలిగించండి. అగరు బత్తీల సువాసన.. మిమ్మల్ని నిద్రలోకి జారుకునేలా చేస్తుంది.
జ్ఞాపక శక్తి మెరుగు పడుతుంది:
మంచి సువాసన కలిగిన అగరు బత్తీలను వెలిగించడం వల్ల.. మతిమరపు దూరమై.. జ్ఞాపక శక్తి కూడా మెరుగు పడుతుందట. అంతే కాకుండా మంచి సువాసన కారణంగా.. మనసు కూడా హాయిగా ఉంటుంది.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
అగరు బత్తీల కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. యూకలిప్టస్, లావెండర్, టీ ట్రీ, పుదీనా ఫ్లేవర్స్ గల అగరు బత్తీలను వాడటం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి.
తలనొప్పి మాయం అవుతుంది:
యూకలిప్టస్, లావెండర్, టీ ట్రీ, పుదీనా ఫ్లేవర్స్ గల అగరు బత్తీలను ఇంట్లో వెలిగించడం వల్ల.. ఆ సువాసనకు తల నొప్పి కూడా తగ్గుతుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ రిఫ్రెష్ ఫీల్ వస్తుంది. అదే విధంగా ఇంట్లో గాలిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్, సూక్ష్మ జీవులు కూడా నశిస్తాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)








