Benefits of OM: ‘ఓం’ జపించడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!

విశ్వంలో ఉద్భవించిన మొదటి ధ్వని 'ఓంకారం' అని చెబుతూ ఉంటారు. అకార, ఉకార, మకార శబ్దాలతో కలిపి ఓంకారం అనేది ఏర్పడింది. అందుకే ఓంకారానికి అంత ప్రాముఖ్యత ఉంది. ధ్యానం, యోగా చేసేటప్పుడు కూడా ఓంకారాన్ని జపిస్తూ ఉంటారు. ఓంకారం జపించడం వల్ల మెదడు రిలీఫ్ నెస్ పొందుతుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఓం జపించే సమయంలో వచ్చే కంపనాలు మన నాడీ వ్యవస్థపై పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. మనసును, ఆత్మను ఒకే చోట..

Benefits of OM: ఓం జపించడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!
Benefits Of Om

Edited By:

Updated on: Dec 23, 2023 | 6:02 PM

విశ్వంలో ఉద్భవించిన మొదటి ధ్వని ‘ఓంకారం’ అని చెబుతూ ఉంటారు. అకార, ఉకార, మకార శబ్దాలతో కలిపి ఓంకారం అనేది ఏర్పడింది. అందుకే ఓంకారానికి అంత ప్రాముఖ్యత ఉంది. ధ్యానం, యోగా చేసేటప్పుడు కూడా ఓంకారాన్ని జపిస్తూ ఉంటారు. ఓంకారం జపించడం వల్ల మెదడు రిలీఫ్ నెస్ పొందుతుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఓం జపించే సమయంలో వచ్చే కంపనాలు మన నాడీ వ్యవస్థపై పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. మనసును, ఆత్మను ఒకే చోట చేర్చవచ్చు. ఆరోగ్య పరంగా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఏకాగ్రత కూడా లభిస్తుంది. అంత శక్తి ఉంది ఓంకారానికి.. ఇలా ఓంకారంతో ఒక్కటేంటి? ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఏకాగ్రత మెరుగు పడుతుంది:

ప్రతి రోజూ ఓం కారం జపించడం వల్ల ఏకాగ్రత మెరుగు పడుతుంది. ఓం కారంతో మనసు, శరీరం ఏకం చేస్తుంది. మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో హెల్ప్ అవుతుంది. అదే విధంగా సమస్యలను కూడా ప్రభావవంతంగా పరిష్కరించుకో గలుగుతారు. ఓం జపించడం వల్ మనసుకి హాయిని ఇస్తుంది. ముఖ్యంగా జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది. ఓం జపించడం వల్ల కోపం, ఆవేశం వంటికి కూడా కంట్రోల్ అవుతాయి.

ఓత్తిడి నుంచి రిలీఫ్:

ప్రస్తుతం ఇప్పుడు ఏ పని చేయాలన్నా ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. ఈ ఒత్తిడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఎటాక్ చేస్తున్నాయి. దీని నుంచి బయట పడాలంటే.. ప్రతి రోజూ ఓంకారం పటించాలి. ఓంకారం పటించడం వల్ల విశ్రాంతి లభిస్తుంది. ఓం కారం పటించే వ్యక్తులు.. తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలుగుతారు. అలాగే నరాలని శాంత పరుస్తుంది.

ఇవి కూడా చదవండి

నిద్రలేమి సమస్యలు దూరం:

నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడే వారు ప్రతి రోజూ ఓం పటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పడుకునే ముందు కాసేపు ఓం పటిస్తే.. త్వరగా నిద్ర పడుతుంది. అదే విధంగా మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది.

ఉదర సమస్యలు తగ్గుతాయి:

ఓంకారం జపించడం వల్ల ఉదర ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. పొట్టలోని కండరాలు రిలాక్స్ అవుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో ఉదర సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.