
కోడి గుడ్లు అనేవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతి రోజూ ఉడకబెట్టిన గుడ్డు తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో వివిధ రోగాలు, ఇన్ ఫెక్షన్‌లతో పోరాడే శక్తి లభిస్తుంది. గుడ్డును ఏ విధంగా తీసుకున్నా.. పోషకాలు అనేవి శరీరానికి బాగా లభిస్తాయి. అయితే కోడి గుడ్లతో ఏం చేసుకున్నా.. వాటి పెంకులను చెత్త బుట్టలో పడేస్తూ ఉంటారు. చాలా మంది ఇలానే చేస్తారు. కానీ వీటితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే.. ఇకపై అలా అస్సలు చేయరు. మరి కోడి గుడ్డు పెంకులతో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? వాటితో ఏం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
కీళ్ల నొప్పులు, అల్సర్ వంటి వాటితో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ గుడ్డు పెంకులను ఉపయోగించుకోవచ్చు. గుడ్డు పెంకులను ఒక గాజు డబ్బాలో చిన్న ముక్కలుగా చేసి వేయాలి… అందులో యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలపాలి. ఇందులో కొండ్రోయిటిన్, హైలురోనిక్ యాసిడ్, గ్లోకోసమైన్, కొల్లాజెన్ వంటివి పోషకాలను వేయండి. గుడ్డు పెంకులు కరిగిపోయే వరకూ.. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టండి. ఆ తర్వాత దీన్ని గాయాలు, పుండ్లపై పూస్తే.. త్వరగా మానుతాయి.
సాధారణంగా ఇంటిని శుభ్రం చేయానికి అనేక ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వల్ల చర్మం పాడయ్యే ప్రమాదం ఉంది. అలా కాకుండా.. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు గుడ్డు పెంకుల పొడిని కలిపి శుభ్రం చేయండి. వీటితో మరకలు, గ్రీజు మరకలు త్వరగా పోతాయి.
ఇంట్లో పెరిగే మొక్కలకు కూడా గుడ్డు పెంకులను వేయవచ్చు. మొక్కల మొదలు దగ్గర గుడ్డు పెంకులను పగుల కొట్టి వేయండి. ఇలా చేస్తే.. మొక్కలకు పోషకాలు అంది.. బాగా పెరుగుతాయి. గుడ్డు పెంకుల్లో క్యాల్షియం, ఖనిజాలు ఉంటాయి. కాబట్టి మొక్కలు బాగా పెరుగుతాయి.
చాలా మంది బ్లాక్ కాఫీని తాగుతూ ఉంటారు. ఇది చాలా చేదుగా ఉంటుంది. అయితే బ్లాక్ కాఫీలో గుండె పెంకులను జోడించడం వల్ల దాని రుచి అనేది పెరుగుతుంది. అంతే కాకుండా.. చేదు కూడా తగ్గుతుంది.
కోడి గుడ్లను కడిగి.. ఎండలో ఆరబెట్టండి. ఆ తర్వాత మెత్తగా కడిగి పొడి చేయాలి. ఈ పొడిలో తేనె, పెరుగు, పాలు, ముల్తానీ మట్టి, బాగా పండిన పండ్లను మిక్స్ చేసి.. చర్మంపై మర్దనా చేయడం వల్ల.. డెడ్ స్కిన్ సెల్స్ పోయి.. కాంతి వంతంగా తయారవుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు