Women’s Heart Attack Signs: మహిళల్లో కనిపించే గుండె పోటు లక్షణాలు ఇవే.. అశ్రద్ధ చేయకండి..

|

Oct 01, 2024 | 3:09 PM

ఈ మధ్య కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధులు బాగా ఎక్కువై పోయాయి. యుక్త వయసులో ఉన్నవారే గుండె పోటుతో అక్కడికక్కడే మరణిస్తున్నారు. గుండె పోటు మరణాలు, వ్యాధులు బాగా పెరిగిపోతున్నాయి. సాధారణంగా ఎలాంటి వ్యాధులు వచ్చే ముందు అయినా వాటి లక్షణాలు అనేవి ముందు బయట పడతాయి. అలాగే గుండె పోటుకు సంబంధించిన లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆ లక్షణాలను సకాలంలో గుర్తిస్తే.. గుండె సంబంధిత సమస్యల నుంచి బయట పడొచ్చు. అయితే గుండె పోటుకు..

Womens Heart Attack Signs: మహిళల్లో కనిపించే గుండె పోటు లక్షణాలు ఇవే.. అశ్రద్ధ చేయకండి..
Women's Heart Attack Signs
Follow us on

ఈ మధ్య కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధులు బాగా ఎక్కువై పోయాయి. యుక్త వయసులో ఉన్నవారే గుండె పోటుతో అక్కడికక్కడే మరణిస్తున్నారు. గుండె పోటు మరణాలు, వ్యాధులు బాగా పెరిగిపోతున్నాయి. సాధారణంగా ఎలాంటి వ్యాధులు వచ్చే ముందు అయినా వాటి లక్షణాలు అనేవి ముందు బయట పడతాయి. అలాగే గుండె పోటుకు సంబంధించిన లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆ లక్షణాలను సకాలంలో గుర్తిస్తే.. గుండె సంబంధిత సమస్యల నుంచి బయట పడొచ్చు. అయితే గుండె పోటుకు సంబంధించిన లక్షణాలు పురుషులతో పోల్చితే మహిళల్లో కాస్త వేరుగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పలు అధ్యయనాల్లో కూడా ఈ విషయం వెల్లడైంది. మరి మహిళల్లో వచ్చే గుండె పోటు లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె పోటు ఎందుకు వస్తుంది:

గుండె పోటు రావడానికి చాలా కారణాలే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా చెప్పాలంటే.. గుండెకు రక్తాన్ని సరఫరాల చేసే రక్త నాళం బ్లాక్ అవ్వడం, కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఈ పరిస్థితి అనేది తలెత్తుతుంది. కొలెస్ట్రాల్ పెరిగితే రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి.. రక్త పోటు అనేది పెరుగుతుంది. కాబట్టి గుండెకు ఎలాంటి అడ్డంకులు లేకుండా రక్తాన్ని సరఫరా చేయడం చాలా ముఖ్యం.

గుండెపై ఒత్తిడి:

పురుషులతో పోల్చితే మహిళల్లో గుండెపై ఒత్తిడి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దవడ, మెడ, భుజం, ఎగువ వీపు, బొడ్డు దిగువ భాగాల్లో నొప్పులు కనిపిస్తాయి. గుండె పోటు వచ్చే ముందు మహిళల్లో కనిపించే లక్షణాల్లో ఇవి కూడా ఒకటి.

ఇవి కూడా చదవండి

శ్వాస సమస్య:

గుండె పోటు వచ్చే ముందు శ్వాసకు సంబంధించిన లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, శ్వాస సరిగా ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

వికారం – వాంతులు:

గుండె పోటు వచ్చే ముందు మహిళల్లో కనిపించే లక్షణాల్లో వికారం, వాంతులు, చెమట్లు ఎక్కువగా పట్టడం, తల తిరుగుతూ ఉండటం, నీరసం, అలసట, చీల మండల్లో వాపులు వంటివి కూడా దీని కిందకే వస్తాయి. అంతే కాకుండా హార్ట్ బీట్ వేగంగా కొట్టుకోవడం, మూర్ఛ కూడా వస్తుంది. ఇలా ఉంటే మాత్రం మహిళలు ఎలాంటి అశ్రద్ధ చేయకుండా వెంటే వైద్యుల్ని సంప్రదించడం అవసరం.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..