AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Joint Pains: కీళ్ల నొప్పులను పెంచే ఫుడ్స్ ఇవే.. వీటి జోలికి పోకండి..

ప్రస్తుత కాలంలో చాలా మంది బాధ పడే సమస్యల్లో కీళ్ల నొప్పలు కూడా ఒకటి. యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలు ఎటాక్ చేస్తున్నాయి. మారిన జీవన శైలిలో అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. కీళ్ల నొప్పులకు ఎలాంటి చికిత్సలు తీసుకున్నా కంట్రోల్ అవడం లేదు. ఇందుకు ముఖ్య కారణం ఆహారం. కీళ్ల నొప్పులతో బాధ పడేవారు కొన్ని రకాల ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. దీని వలన కీళ్ల నొప్పుల..

Joint Pains: కీళ్ల నొప్పులను పెంచే ఫుడ్స్ ఇవే.. వీటి జోలికి పోకండి..
Joint Pains
Chinni Enni
|

Updated on: Oct 09, 2024 | 3:46 PM

Share

ప్రస్తుత కాలంలో చాలా మంది బాధ పడే సమస్యల్లో కీళ్ల నొప్పలు కూడా ఒకటి. యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలు ఎటాక్ చేస్తున్నాయి. మారిన జీవన శైలిలో అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. కీళ్ల నొప్పులకు ఎలాంటి చికిత్సలు తీసుకున్నా కంట్రోల్ అవడం లేదు. ఇందుకు ముఖ్య కారణం ఆహారం. కీళ్ల నొప్పులతో బాధ పడేవారు కొన్ని రకాల ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. దీని వలన కీళ్ల నొప్పుల సమస్య మరింత పెరుగుతుంది. ఇంతకీ ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు మరింత పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రెడ్ మీట్:

రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు అనేవి మరింత పెరుగుతాయి. ఎందుకంటే ఇందులో ప్యూరిన్స్ ఎక్కువగా ఉంటాయి. తెలీకుండా వీటిని ఎక్కువగా తినడం వల్ల కీళ్ల నొప్పులు, నడుము నొప్పి పెరుగుతాయి. ఈ ప్యూరిన్స్ అేవి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను కూడా పెంచుతాయి. అంతే కాకుండా గౌట్ అనే వ్యాధికి దారి తీస్తుంది.

సీ ఫుడ్స్:

చాలా మంది మంచిది కదా అని చేపలు, రొయ్యలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీటిల్లో కూడా ప్యూరిన్స్ అధికంగా ఉంటాయి. వీటి వల్ల శరీరంలో తీవ్రమైన నొప్పులు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుననారు. కాబట్టి వీటిని మితంగా తీసుకోవడమే బెటర్.

ఇవి కూడా చదవండి

చక్కెర అధికంగా ఉన్న పదార్థాలు:

షుగర్ అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం వలన కూడా కీళ్ల నొప్పులు అనేవి తీవ్రంగా వస్తాయి. కాబట్టి కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులతో బాధ పడేవారు షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలు అస్సలు తీసుకోపోవడమే మంచిది.

సోయా ఫుడ్స్:

సోయా తినడం ఆరోగ్యానికి మంచిదే. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ మెండుగా లభిస్తుంది. కానీ మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంత మందిలో ఇది అలర్జీని కలిగిస్తుంది. అలాగే కీళ్ల నొప్పులు కూడా పెంచుతుంది. సోయా తిన్న తర్వాత మీకు కాళ్ల నొప్పులు వస్తే మాత్రం.. వీటిని తినకపోవడం మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..