స్మార్ట్‌ఫోన్‌తో టాయిలెట్‌కి వెళ్తున్నారా? అయితే ఆ సమస్య కొనితెచ్చుకున్నట్టే..!

స్మార్ట్ ఫోన్ అంటే మినీ కంప్యూటర్‌తో సమానం. ఇది కేవలం మాట్లాడుకోడంతో పాటు ఎన్నో పనులు చేసిపెడుతుంది. అంతగా మానవ జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే స్మార్ట్‌ఫోన్‌తో ఎంతగా అనుబంధాన్ని ఏర్పరచుకున్నా కొంతమంది ఏకంగా టాయిలెట్‌లో కూడా ఉపయోగిస్తుంటారు. ఇలాంటి అలవాటు ఉన్న వారికి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నట్టు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా టాయిలెట్‌లో స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం వల్ల పైల్స్ సమస్య వచ్చే అవకాశాలున్నాయట. మామూలుగా స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే వారికంటే మరుగుదొడ్డిలో ఉపయోగించేవారు […]

స్మార్ట్‌ఫోన్‌తో టాయిలెట్‌కి వెళ్తున్నారా? అయితే ఆ సమస్య కొనితెచ్చుకున్నట్టే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Oct 05, 2019 | 7:53 PM

స్మార్ట్ ఫోన్ అంటే మినీ కంప్యూటర్‌తో సమానం. ఇది కేవలం మాట్లాడుకోడంతో పాటు ఎన్నో పనులు చేసిపెడుతుంది. అంతగా మానవ జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే స్మార్ట్‌ఫోన్‌తో ఎంతగా అనుబంధాన్ని ఏర్పరచుకున్నా కొంతమంది ఏకంగా టాయిలెట్‌లో కూడా ఉపయోగిస్తుంటారు. ఇలాంటి అలవాటు ఉన్న వారికి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నట్టు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా టాయిలెట్‌లో స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం వల్ల పైల్స్ సమస్య వచ్చే అవకాశాలున్నాయట. మామూలుగా స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే వారికంటే మరుగుదొడ్డిలో ఉపయోగించేవారు ఎక్కువ సేపు అక్కడే గడిపడం అలవాటుగా ఉంటుందట. అందువల్ల ఇది మలద్వారం వద్ద ఉన్న సిరలపై ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కొంతమంది ఈమెయిల్స్, సోషల్‌మీడియా పోస్టుల్ని టాయిలెట్‌లోకి వెళ్లి మరీ చేస్తుంటారు. వీరికి టైమ్ లేకపోవడమే అసలు కారణం. ఎక్కడా టైమ్ వేస్టే చేయకుండా సద్వినియోగం చేసుకుంటున్నాం అనే ఆలోచనతో అనారోగ్య సమస్యల్ని కొనితెచ్చుకుంటున్నారు. వీరు ఈ విధంగా ఉపయోగించడం వల్ల టాయిలెట్‌లో చేయాల్సిన పనులు సక్రమంగా చేయకపోగా, మల విసర్జన సమయంలో , మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడి రక్తస్రావం కలిగే అవకాశాలున్నాయంటున్నారు.

మీరు స్మార్ట్‌ఫోన్‌ను టాయిలెట్‌కు తీసుకువెళితే , అక్కడ ఎక్కువ సేపు కూర్చుని ఉంటారని, ఇలా చేయడం వల్ల శరీరం కిందభాగంలో అనవసరమైన అధిక ఒత్తిడిని కలిగిస్తుందని, ఇది హెమరాయిడ్స్‌కు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇలా తమ స్మార్ట్‌ఫోన్‌ను టాయిలెట్‌కు తీసుకువెళ్లే వారిపై నిర్వహించిన ఒక సర్వేలో బ్రిటన్‌కు చెందిన వారు దాదాపు 57 శాతం మంది ఇదేవిధమైన అలవాటు కలగి ఉన్నట్టుగా తేలింది. పైగా అందులో 8 శాతం మంది తమకు ఇది అలవాటుగా మారిందని కూడా చెప్పడం విశేషం. ఏది ఏమైనా ప్రకృతికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తిచేసే సమయంలో ఈ విధంగా స్మార్ట్‌ఫోన్లను తీసుకెళ్లడం, పైగా గంటల తరబడి అందులో గడపడం మూలశంఖ వ్యాధికి కారణమవుతుందని వైద్యులు హెచ్చిరిస్తున్నారు.