ఏప్రిల్‌ 12 నుంచి పవిత్ర రంజాన్ మాసం.. ముఖ్యమైన తేదీలు, ఉపవాస నియమాలు తెలుసుకోండి..

RAMZAN 2021: ఈ నెల 12 నుంచి పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. ఇస్లాం మతాన్ని ఆచరించే ప్రతి వ్యక్తి కామం, క్రోధం, అహంకారం, అహింసా వంటి దుర్గుణాలను వదిలేసి భగవంతుడి నామ స్మరణంతో

  • uppula Raju
  • Publish Date - 5:28 am, Sun, 11 April 21
ఏప్రిల్‌ 12 నుంచి పవిత్ర రంజాన్ మాసం.. ముఖ్యమైన తేదీలు, ఉపవాస నియమాలు తెలుసుకోండి..
Ramzan 2021

RAMZAN 2021: ఈ నెల 12 నుంచి పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. ఇస్లాం మతాన్ని ఆచరించే ప్రతి వ్యక్తి కామం, క్రోధం, అహంకారం, అహింసా వంటి దుర్గుణాలను వదిలేసి భగవంతుడి నామ స్మరణంతో శాంతి, సహనం వంటి జీవితం సాగించాలని మత గ్రంథాల్లో లిఖించబడింది. ఇలాంటి పవిత్రమైన జీవనాన్ని కొనసాగించాలంటే భగవంతుడిపై విశ్వాసం కలగి ఉంటూ ప్రతీ రోజూ నమాజ్ చేయవలసి ఉంటుంది. కనుక మనలో ఆధ్యాత్మిక చింతన రగిల్చేందుకు ఏడాదికి ఒక సారి రంజాన్ నెలలో కఠిన నింబంధనలతో కూడిన ఉపవాసదీక్షను పాటిస్తారు.

ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం చేస్తారు. అల్లాహ్ జ్ఞాపకార్థం తమ సమయాన్ని వెచ్చిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం తొమ్మిదో నెలలో రంజాన్ పాటిస్తారు. రంజాన్ నెల ప్రారంభం అర్ధచంద్రాకారపు మొదటి దృశ్యం ప్రకారం నిర్ణయిస్తారు. తరువాతి రోజున ఈద్-ఉల్-ఫితర్ అని పిలుస్తారు.ఇస్లామిక్ క్యాలెండర్ చంద్ర కదలికపై ఆధారపడి ఉంటుంది కనుక గ్రెగోరియన్ క్యాలెండర్‌లో ప్రతి సంవత్సరం తేదీలు మారుతూ ఉంటాయి. 2021 లో రంజాన్ ఏప్రిల్ 12 న ప్రారంభమై మే 11 తో ముగుస్తుంది. రంజాన్ చివరి రోజును ఈద్-ఉల్-ఫితర్ అని పిలుస్తారు ఇది ఇస్లాంలో పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది.

రంజాన్ నెలలో కఠిన నింబంధనలతో కూడిన ఉపవాసదీక్షను పాటిస్తారు. ఉపవాసదీక్ష అంటే కేవలం ఘన, ద్రవ పదార్ధాలకు దూరంగా ఉంటమే కాదు…మన జ్ఞానేంద్రియాలను నియంత్రణలో ఉంచడమని మత పెద్దలు చెబుతున్నారు. దీక్షలో ఉన్నప్పుడు నోటితో అబద్దాలాడరాదు..చెవులద్వారా చెడు వినరాదు…కళ్లతో అశ్లీలం వంటిని చూడరాదు..మనం చేసే ప్రతి చర్య సన్మార్గంలో ఉండే విధంగా చూడటమని మత గ్రంథాల్లో చెప్పబడింది..నెల రోజుల పాటు ఇలాంటి కఠోర నిమయం పాటించుట వలన.. ఏడాదిలో మిగిలిన 11 నెలలు పవిత్రమైన జీవినాన్ని కొనసాగించేందుకు ప్రేరణ కల్గుతుందని … తద్వారా ఆధ్యాత్మిక జీవనం కొనసాగించేందుకు మార్గం సుగమం అవుతుందని ఇస్లాం మతం చెబుతోంది.

చెన్నైపై విజయం సాధించిన ఢిల్లీ.. శిఖర్‌ ధావన్‌ దాడికి చతికిలపడిన సీఎస్‌కే బౌలర్లు.. రాణించిన పృథ్వీ షా..

Dead Whale : బంగ్లాదేశ్ సముద్రపు ఒడ్డుకు కొట్టుకువచ్చిన 35 అడుగుల చనిపోయిన తిమింగలం

ఆసియా క్వాలిఫయర్స్​లో అదరగొట్టిన భారత మహిళా రెజ్లర్లు.. టోక్యో ఒలింపిక్స్‌లో బెర్తులు ఖరారు