AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సీతాఫలం’ ఆరోగ్యానికి ఎంతో బలం!

ప్రకృతి ఒడిలో దొరికే సీజనల్ ఫ్రూట్ సీతాఫలం. పోషక విలువలు సమృద్ధిగా ఉండి ఒక్క పండు తిన్న వెంటనే శరీరానికితక్షణ శక్తి లభిస్తుంది. ఇంకా ఇందులోని ఐరన్, విటమిన్ సి, పాస్ఫరస్, మెగ్రీషియం అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలుచేస్తుంది. సీతాఫలంతో కలిగే మరిన్ని లాభాలుః – రక్తంలో గ్లూకోజ్‌ శాతాన్ని అదుపులో ఉంచుతుంది. – సీతాఫలం రోజు తినడం వల్ల విటమిన్‌ సి శరీరానికి సమృద్ధిగా లభిస్తుంది. – రక్తంలోని ఇన్సులిన్‌ శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. – -ఇందులోని […]

'సీతాఫలం' ఆరోగ్యానికి ఎంతో బలం!
Pardhasaradhi Peri
|

Updated on: Oct 17, 2019 | 5:39 PM

Share

ప్రకృతి ఒడిలో దొరికే సీజనల్ ఫ్రూట్ సీతాఫలం. పోషక విలువలు సమృద్ధిగా ఉండి ఒక్క పండు తిన్న వెంటనే శరీరానికితక్షణ శక్తి లభిస్తుంది. ఇంకా ఇందులోని ఐరన్, విటమిన్ సి, పాస్ఫరస్, మెగ్రీషియం అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలుచేస్తుంది. సీతాఫలంతో కలిగే మరిన్ని లాభాలుః – రక్తంలో గ్లూకోజ్‌ శాతాన్ని అదుపులో ఉంచుతుంది. – సీతాఫలం రోజు తినడం వల్ల విటమిన్‌ సి శరీరానికి సమృద్ధిగా లభిస్తుంది. – రక్తంలోని ఇన్సులిన్‌ శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. – -ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారకాలని దూరం చేస్తాయి. – శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. చలువ చేస్తాయి. – రక్తహీనత బారిన పడకుండా సీతాఫలం కాపాడుతుంది. – కండరాలను దృఢంగా ఉంచే మెగ్నీషియం పోషకాన్ని అందిస్తుంది. – సీతాఫలంలో ఉండే కాపర్‌ రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. – ఒక సీతాఫలంలోనే వెయ్యి మిల్లీ గ్రాముల కాపర్‌ లభిస్తుంది. – ఇంకా దీనిలో లభించే డయిటరీ పీచు జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చూస్తుంది. – కొవ్వూ, కెలొరీలు తక్కువగా ఉండి బరువు తగ్గాలనుకునేవారికి మేలు చేస్తుంది. – విటమిన్‌ ఎ కలిగి ఉండటంతో కంటిచూపు బాగుండేందుకు తోడ్పడుతుంది. – యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఈ కాలంలో వేధించే సమస్యలతో పోరాడతాయి. – ఇన్ఫెక్షన్లు దరి చేరవు. గాయాలు కూడా త్వరగా మానుతాయి – సీజన్లో రోజూ వీటిని తినడం వల్ల కడపులో మంట తగ్గుతుంది – జీర్ణశక్తి పెంపొందుతుంది. ఎముకలు దృఢంగా మారతాయి –  కండరాలు, నరాల బలహీనతను అధిగమించడానికి సీతాఫలం తోడ్పడుతుంది