పచ్చి మామిడి రసంతో మీ బరువుకు ఇలా చెక్ పెట్టేయండి..

వేసవి వచ్చేసింది ఈ కాలంలోనే సీజనల్ పండు ఏదైనా ఉందంటే మామిడిపండు అనే చెప్పాలి మామిడి పండు అంటే చాలామందికి ఇష్టమే. కానీ మామిడి పండు కన్నా కూడా పచ్చి మామిడికాయలో ఎక్కువ పోషక గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతూ ఉంటారు.

పచ్చి మామిడి రసంతో మీ బరువుకు ఇలా చెక్ పెట్టేయండి..
శ్వాసకోశ ఆరోగ్యం: మామిడి ఆకులు శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు ఈ వ్యవస్థ ఆరోగ్యానికి ప్రయోజనంగా ఉంటుంది. ఇందుకోసం కూడా మీరు మామిడి ఆకులను మరిగించి తాగితే సరిపోతుంది.
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 03, 2023 | 9:55 AM

వేసవి వచ్చేసింది ఈ కాలంలోనే సీజనల్ పండు ఏదైనా ఉందంటే మామిడిపండు అనే చెప్పాలి మామిడి పండు అంటే చాలామందికి ఇష్టమే. కానీ మామిడి పండు కన్నా కూడా పచ్చి మామిడికాయలో ఎక్కువ పోషక గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో పశ్చిమామిడికాయలతో చేసే ఆమ్ప్ అన్న జ్యూస్ చాలా ఫేమస్ దీన్ని ఈ సీజన్లో తీసుకోవడం ద్వారా బరువు తగ్గాలనుకునేవారు సులభంగా బరువు తగ్గే వీలుంది. రసం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పచ్చిమామిడి కాయలను ముక్కలుగా చేసి ఊరగాయలు పెట్టుకోవడం ప్రతి ఇంట్లోనూ మనం ఈ సీజన్లో గమనిస్తూనే ఉంటాం అయితే. ఉత్తర భారత దేశంలో సాధారణంగా పచ్చిమామిడికాయలతో చేసే జ్యూస్ చాలా ఫేమస్ అనే చెప్పాలి ఈ జ్యూస్ తాగడం ద్వారా వేసవిలో మన శరీరం కోల్పోయే అనేక మినరల్స్ అదేవిధంగా లవణాలను భర్తీ చేస్తుందని చెప్పవచ్చు. అంతేకాదు ఈ జ్యూస్ తాగడం ద్వారా మనకి త్వరగా ఆకలి అవ్వదు ఫలితంగా బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. ఎవరైతే డైటింగ్ లో ఉంటారో వాళ్లు ఈ పచ్చి మామిడికాయలు జ్యూస్ ను తాగడం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ పచ్చి మామిడికాయలు చూసి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముందుగా రెండు పచ్చి మామిడికాయలను మెత్తబడే వరకు ఉడకబెట్టాలి. అవి ఉడికిన తర్వాత, దాని తొక్క తీసి, గుజ్జును ఓ కప్పులో భద్రపరుచుకోవాలి. మీ మామిడికాయ గుజ్జులో ఒక టీ స్పూన్ పంచదార, రుచికి తగినంత ఉప్పుతో కలిపి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఈ మామిడికాయ గుజ్జులో జీలకర్ర , మిరియాలు, ధనియాల పొడి వంటి మసాలా దినుసులను కలుపుతారు. దీంతో ఈ గుజ్జు కొద్దిగా కారంగానూ, తియ్యగానూ, పుల్లగానూ ఉంటుంది. ఇప్పుడు మీ మామిడి పన్నా సిద్ధంగా ఉంది.

ఇప్పుడు మామిడి పన్నా డ్రింక్ తయారు చేయడం చాలా సులభం. మీరు ఒక టీస్పూన్ మామిడి గుజ్జును తీసుకోవాలి దానికి ఒక గ్లాసు చల్లటి నీటిని ఐస్ క్యూబ్స్‌తో జోడించాలి.ఇప్పుడు తియ్యటి పుల్లటి రుచి కలిగిన మామిడి పన్నా జ్యూస్ సిద్ధం అవుతుంది. ఈ మామిడి పన్నా జ్యూస్ పైన రుచు కోసం కొద్దిగా పుదీనా ఆకులను వేసుకుంటే బాగుంటుంది. అలాగే రుచికోసం తేనెను కూడా కలుపుకోవచ్చు. సబ్జా గింజలను జోడిస్తే కూడా మరింత రుచికరంగాను శరీరానికి చలువ చేస్తుందని చెప్పవచ్చు.

ఈ మామిడి పండ్ల జ్యూస్ ను సాయంకాలం పూట తీసుకుంటే చాలా మంచిది. ఈ జ్యూస్ తాగిన తర్వాత రాత్రి భోజనం వేళ ఎక్కువగా ఆకలి అవ్వదు ఫలితంగా మీరు బరువు తగ్గే అవకాశం లభిస్తుంది. అలాగే మీ శరీరం వేసవి చెమటలో కోల్పోయిన లవణాలు పోషకాలను అందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లలు ఇంట్లో పెద్దలకు ఈ జ్యూస్ రుచి చూపించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..