2023 Long Weekends: రెచ్చిపోదాం బ్రదర్..2023 లో 15 లాంగ్ వీకెండ్స్ ఇవే..ట్రిప్స్ ప్లాన్ చేసుకునేవారు ఓ లుక్కెయ్యండి

2023 క్యాలెండర్ ప్రకారం కేవలం ఒకటి లేదా రెండు రోజుల సెలవుతో లాంగ్ వీకెండ్ ట్రిప్ లు ఏర్పాటు చేసుకోవచ్చు. నిజమే నూతన సంవత్సరంలో దాదాపు 15 లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి. కరెక్ట్ గా ప్లాన్ చేస్తే ట్రిప్స్ తో ఇరగదీయొచ్చు.

2023 Long Weekends: రెచ్చిపోదాం బ్రదర్..2023 లో 15 లాంగ్ వీకెండ్స్ ఇవే..ట్రిప్స్ ప్లాన్ చేసుకునేవారు ఓ లుక్కెయ్యండి

Edited By:

Updated on: Dec 23, 2022 | 6:55 PM

పని ఒత్తిడి నుంచి దూరంగా నూతన సంవత్సరంలో ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో ట్రిప్స్ ను ప్లాన్ చేయాలనుకుంటున్నారా? ట్రిప్స్ కు వెళ్లాలంటే ప్లానింగ్ తప్పనిసరి. ఇలాంటి సమయంలో ఉద్యోగులను వెంటాడే ఒకటే సమస్య సెలవు. చాలా మందిరికి ఒకరోజు సెలవు అయితే పర్లేదు కానీ రోజుల తరబడి సెలవు తీసుకోడానికి కుదరదు. పోనీ ఎక్కువ రోజుల లేకుండా ప్లానింగ్ అంటే అస్సలు అవ్వని పని. అయితే అలాంటి వారికి 2023 క్యాలెండర్ ప్రకారం కేవలం ఒకటి లేదా రెండు రోజుల సెలవుతో లాంగ్ వీకెండ్ ట్రిప్ లు ఏర్పాటు చేసుకోవచ్చు. నిజమే నూతన సంవత్సరంలో దాదాపు 15 లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి. కరెక్ట్ గా ప్లాన్ చేస్తే ట్రిప్స్ తో ఇరగదీయొచ్చు. సో 2023 లో పండుగ సెలవులతో పాటుగా వచ్చే వీకెండ్స్ పై ఓ లుక్కెద్దాం.

2023లో వచ్చే లాంగ్ వీకెండ్స్ ఇవే

జనవరి 

  1. డిసెంబర్ 31 శనివారం, జనవరి 1 ఆదివారం కాబట్టి మీరు ముందు రోజు శుక్రవారం లేదా తర్వత రోజు సోమవారం సెలవు తీసుకుంటే మూడు రోజుల న్యూ ఇయర్ వేడుకలను చేసుకోవచ్చు.
  2. జనవరి 14 న భోగి శనివారం, జనవరి 15న ఆదివారం వచ్చింది కాబట్టి సోమవారం కూడా సెలవు తీసుకుంటే ఫ్యామిలీతో సంక్రాంతి వేడులకు సొంతూరు వెళ్లడానికి అనువుగా ఉంటుంది.
  3.  జనవరి 26 గణతంత్ర దినోత్సవం గురువారం వచ్చింది, అలాగే జనవరి 28 శనివారం, జనవరి 29 ఆదివారం. సో జనవరి 27 శుక్రవారం ఒక్కరోజు సెలవు తీసుకుంటే నాలుగు రోజుల సెలవులు వస్తాయి. 

ఫిబ్రవరి

ఫిబ్రవరి 18న మహాశివరాత్రి శనివారం, ఫిబ్రవరి 19 ఆదివారం సో 17న కానీ, 20 న కానీ సెలవు తీసుకుంటే మూడు రోజుల సెలవుతో ఇంచక్కా తీర్థయాత్ర ప్లాన్ చేసుకోవచ్చు.

మార్చి

మార్చి 8న హోలీ బుధవారం వచ్చింది. అలాగే మార్చి 11 శనివారం, మార్చి 12 ఆదివారం వచ్చాయి. సో మార్చి 9, 10 తారీఖుల్లో రెండు రోజులు సెలవు తీసుకున్నారంటే మొత్తం ఐదు రోజుల పాటు వీకెండ్ ప్లాన్ అదరగొట్టేయచ్చు.

ఇవి కూడా చదవండి

ఏప్రిల్

ఏప్రిల్ 4న మంగళవారం మహవీర్ జయంతి, ఏప్రిల్ 7న గుడ్ ఫ్రైడే శుక్రవారం,  ఆటో మెటిగ్గా 8, 9 శని, ఆది వారాలు కాబట్టి 5, 6 అంటే బుధ, గురువారాలు రెండు రోజులు సెలవు  తీసుకుంటే మొత్తం ఆరు రోజుల సెలవులు వస్తాయి. సో ఫ్రెండ్స్ తో సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.

మే 

మే 5న శుక్రవారం బుద్ధ పూర్ణిమ, మే 6 శనివారం, మే 7 ఆదివారం. వరుసగా మూడు రోజుల సెలవులు వచ్చాయి. 

జూన్, జూలై

  1. జూన్ 17, 18 శని, ఆదివారాలు వచ్చాయి. అయితే జూన్ 20న రథయాత్ర ఉంది. సో ఆ రోజు కొన్ని కంపెనీలు సెలవు ఇస్తుంది. ఇలాంటి వారు జూన్ 19 సోమవారం సెలవు పెట్టుకుంటే నాలుగు రోజుల సెలవులను ఎంజాయ్ చేయవచ్చు. 
  2. జూన్ 29, గురువారం బక్రీద్ వచ్చింది. అలాగే జూలై 1, 2 శని, ఆదివారాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జూన్ 30 న శుక్రవారం ఒక్కరోజు సెలవు తీసుకుంటే నాలు రోజుల పాటు ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. 

ఆగస్టు

  1. ఆగస్ట్ 12, 13 తేదీలు శని, ఆదివారాలు, అలాగే ఆగస్టు 15 మంగళవారం ఇండిపెండెన్స్ డే సెలవు. సో ఆగస్టు 14న సెలవు తీసుకుంటే నాలుగు రోజుల పాటు సెలవులు వస్తాయి.  
  2. ఆగస్టు 26, 27 శని, ఆదివారాలు ఆగస్టు 29న ఓనం, అలాగే ఆగస్టు 30న రక్షా బంధన్ సో 28న సెలవు తీసుకుని ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. 

సెప్టెంబర్

  1. సెప్టెంబర్ 7న గురువారం కృష్ణాష్టమి, అలాగే 9, 10 శని ఆదివారాలు. 8వ తేదీ ఒకరోజు సెలవు తీసుకుంటే నాలుగు రోజుల పాటు సెలవులు వస్తాయి. 
  2. సెప్టెంబర్ 16, 17 శని ఆదివారాలు, అలాగే సెప్టెంబర్ 19 వినాయక చవితి వచ్చింది. 18న సెలవు తీసుకుని వినాయక ఉత్సావాలకు ఫ్యామిలితో వెళ్లవచ్చు. 

అక్టోబర్

  1. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 శని, ఆదివారాలు, అక్టోబర్ 2 గాంధీ జయంతి  సోమవారం కూడా సెలవు. ఇక్కడ ఎలాంటి సెలవు పెట్టకుండా మూడు రోజులు ఎంజాయ్ చేయవచ్చు. 
  2. అక్టోబర్ 21, 22 శని, ఆదివారాలు, అక్టోబర్ 24 దసరా సెలవు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న కూడా సెలవు తీసుకుంటే నాలుగు రోజులు దసరా సెలవుల నేపథ్యంలో పిల్లలతో కలిపి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. 

నవంబర్

  1. నవంబర్ 11న శనివారం, నవంబర్ 12న దీపావళి ఆదివారం వచ్చింది. సో వీటికి సమాంతరంగా ఇంకో సెలవును ప్లాన్ చేసుకుంటే దీపావళి నేపథ్యంలో ఎంజాయ్ చేయవచ్చు. 
  2. నవంబర్ 25, 26 శని, ఆదివారాలు,  నవంబర్ 27న సోమవారం గురునానక్ జయంతి వచ్చింది. సో ఇక్కడ కూడా ఎలాంటి సెలవు తీసుకోకుండా మూడు రోజులు సెలవులు వస్తాయి. 

డిసెంబర్

డిసెంబర్ 23, 24 శని, ఆదివారాలు, అలాగే డిసెంబర్ 25 క్రిస్మస్ సోమవారం నాడు వచ్చింది. ఈ నెలల మూడు రోజుల పాటు క్రిస్మస్ ట్రిప్ పెట్టుకుంటే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..