AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఎమోషన్స్‌ని కంట్రోల్‌ చేసుకుంటున్నారా..? అది ఎంత డేంజరో తెలుసా..

మీరు చాలా కాలంగా ఏదో విషయమై మీలో మీరే మదనపడుదూ మీలోని భావోద్వేగాన్ని అణిచివేసుకుంటున్నారా..? అయితే, మీరు డేంజర్‌లో ఉన్నట్టే.. ఎందుకంటే.. అది మీ అవయవాలను దెబ్బతీస్తుందట.. దీని వల్ల మనం తీవ్ర అనారోగ్యానికి గురవుతాము. అవును మన భావోద్వేగాలు కూడా మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మీ ఎమోషన్స్‌ని కంట్రోల్‌ చేసుకుంటున్నారా..? అది ఎంత డేంజరో తెలుసా..
Emotions Affect
Jyothi Gadda
|

Updated on: Apr 17, 2025 | 4:24 PM

Share

నేటి బిజీ లైఫ్‌ స్టైల్‌ కారణంగా మనకోసం మనం కొంచం టైమ్‌ కూడా కేటాయించుకోలేకపోతున్నాము. ఇది మనలో అనేక భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. అటువంటి పరిస్థితిలో మన శరీరం కూడా అనేక విధాలుగా స్పందిస్తుంది. మనం అనుభూతి చెందే దానికి మన శరీరం స్పందిస్తుంది. ఆనందం, కోపం, భయం, ఆందోళన, విచారం, ఇవన్నీ మన మనస్సును మాత్రమే కాకుండా మన శరీరంలోని వివిధ భాగాలను కూడా ప్రభావితం చేస్తాయి. మీరు చాలా కాలంగా ఏదో విషయమై మీలో మీరే మదనపడుదూ మీలోని భావోద్వేగాన్ని అణిచివేసుకుంటున్నారా..? అయితే, మీరు డేంజర్‌లో ఉన్నట్టే.. ఎందుకంటే.. అది మీ అవయవాలను దెబ్బతీస్తుందట.. దీని వల్ల మనం తీవ్ర అనారోగ్యానికి గురవుతాము. అవును మన భావోద్వేగాలు కూడా మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన భావోద్వేగాలు మన శరీర భాగాలను ఈ విధంగా ప్రభావితం చేస్తాయో ఇక్కడ తెలుసుకుందాం…

* కోపం – కాలేయం:

ఈ రోజుల్లో మనుషులకు చాలా త్వరగా కోపం వస్తుంది. ఎక్కువ మంది ఎప్పుడూ నిరాశలోనే ఉంటుంటారు. అలాంటి వారు చిన్న చిన్న విషయాలకు కూడా తక్షణమే స్పందిస్తూ కోపంగా ఉంటారు. అలా ఎవరికైనా ఎక్కువ కోపం వచ్చినప్పుడు.. అది మన కాలేయంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల తలనొప్పి, చిరాకు, జీర్ణ సమస్యలు, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

* భయం – కిడ్నీ:

ఎప్పుడూ ఏదో ఒక భయం, ఆందోళనతో ఉండే వారు త్వరగా మూత్రపిండాల వ్యాధుల బారినపడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. భయం, ఆందోళన వంటి ఉద్వేగాలు మూత్రపిండాలను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. దీనివల్ల అలసట, వెన్నునొప్పి, నిద్రలేమి, తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

బాధ, విచారం – ఊపిరితిత్తులు: అలాగే, కొందరు ఎప్పుడూ విచారంగా ఉంటూ ఉంటారు. అది మీ ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో బరువు, బలహీనత వంటి సమస్యలు ఎదుర్కొంటారు.

* ఆందోళన- ప్లీహము:

ప్రతి చిన్న లేదా పెద్ద విషయం గురించి ఆందోళన చెందడం వల్ల ప్లీహము బలహీనపడుతుంది. ఇది మన కడుపుపై ప్రభావం చూపుతుంది . దీని వలన ఆకలి లేకపోవడం, అజీర్ణం, కడుపులో భారమైన భావన కలుగుతుంది.

* దుఃఖం – హృదయం:

ఎక్కువ కాలం నిరాశకు గురికావడం మన గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది క్రమరహిత హృదయ స్పందన మరియు నిరంతర అలసట మరియు బలహీనతకు కారణమవుతుంది.

* అసూయ – కాలేయం, పిత్తాశయం:

మీరు ఎవరినైనా చూసి అసూయపడితే అది కాలేయం, పిత్తాశయంపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది అజీర్ణానికి కారణమవుతుంది. మనస్సును అశాంతితో నిండిపోయేలా చేస్తుంది.

దాన్ని ఎలా నివారించాలి? మనస్సు సంతోషంగా ఉన్నప్పుడు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.. అందుకే మీలోని భావోద్వేగాలను అణచివేయకూడదని అంటున్నారు. వాటిని అర్థం చేసుకున్న తర్వాత వ్యక్తీకరించడం నేర్చుకోవాలి. కోపం, భయం, ఆందోళన, విచారాన్ని మీ మనసులోనే దాచుకోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. అదే నవ్వుతూ, సంతోషంగా ఉంటూ నలుగురితో కలిసి మెలిసి…ఉంటూ మీ వాళ్లతో మీ భావోద్వేగాలను పంచుకోవటం వల్ల ఓదార్పుగా ఉంటారు. అందరితో హృదయపూర్వకంగా మాట్లాడటం ద్వారా జీవితాన్ని అందంగా ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..