ప్రతి ఉదయం మీ రోజును ఇలా మొదలు పెట్టండి..! మీ గుండెకు ఎన్ని లాభాలో తెలిస్తే..

తద్వారా గుండెకు ఆక్సిజన్, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అందుకే రోజూ ఉదయం 10 నిమిషాలు ధ్యానం, యోగా, తేలికపాటి వ్యాయామాలు చేస్తే ఈ హెచ్ఆర్‌వీ మెరుగ్గా ఉంటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఉదయం రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఒత్తిడి, హైపర్ టెన్షన్ సమస్యలతో బాధపడేవారికి ఈ సమస్య ఉంటుంది.

ప్రతి ఉదయం మీ రోజును ఇలా మొదలు పెట్టండి..! మీ గుండెకు ఎన్ని లాభాలో తెలిస్తే..
Jumping Jacks Exercise

Updated on: Jul 18, 2025 | 9:12 PM

ఉదయం 10 నిమిషాలు వ్యాయామం చేసేవారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే మీ ఆరోగ్యంలో ఎక్సర్‌సైజ్‌కు ఓ 10 నిమిషాలు కేటాయించాలని ఆరోగ్యనిపుణులు పదే పదే చెబుతున్నారు. ఉదయం పూట కేవలం 10 నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా గుండె వేగం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఒకవేళ కఠిన వ్యాయామాలు ఎక్కువసేపు చేస్తే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే 10 నిమిషాల ఎక్సర్‌సైజ్ గుండెకు మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట 10 నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ధమనులను రిలాక్స్ చేసి గుండెకు రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చూస్తుంది. దీంతో హృదయ సంబంధ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

ఉదయం 10 నిమిషాలు వ్యాయామం చేసేవారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే మీ ఆరోగ్యంలో ఎక్సర్‌సైజ్‌కు ఓ 10 నిమిషాలు కేటాయించండి. హృదయ కండరాలు బలంగా ఉండాలంటే ఆక్సిజన్, రక్త ప్రసరణ బాగుండాలి. దీనికోసం ఉదయం 10 నిమిషాలు వ్యాయామం చేయడం మంచిది. తద్వారా గుండెకు ఆక్సిజన్, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అందుకే రోజూ ఉదయం 10 నిమిషాలు ధ్యానం, యోగా, తేలికపాటి వ్యాయామాలు చేస్తే ఈ హెచ్ఆర్‌వీ మెరుగ్గా ఉంటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఉదయం రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఒత్తిడి, హైపర్ టెన్షన్ సమస్యలతో బాధపడేవారికి ఈ సమస్య ఉంటుంది.

అయితే ఉదయం 10 నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. ఉదయం లేవగానే ఒత్తిడి పెంచే కార్టిసాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీనిని తగ్గించుకునేందుకు 10 నిమిషాలు వ్యాయామం చేయడం మంచిది. తద్వారా కార్టిసాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. మంచి మూడ్ లభిస్తుంది. ఒత్తిడి అధికంగా ఉంటే గుండెపై నెగిటివ్ ప్రభావం పడుతుంది. అందువల్ల ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉదయం 10 నిమిషాలు వాకింగ్, జాగింగ్, స్ట్రెచింగ్, యోగా వంటివి చేయడం మంచిది. దీనివల్ల ఒత్తిడి తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..