డ్రై ఫ్రూట్స్‌లో ఖర్జూరాలు కూడా ఒకటి. ఖర్జూరంలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. మనిషి శరీరానికి కావాల్సినన్ని విటమిన్లు, మినరల్స్ ఖర్జనూరంలో లభిస్తాయి. ప్రతి రోజూ రెండు ఖర్జూరాలు తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అంతే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవు. ముఖ్యంగా బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఖర్జూరాల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పచ్చివి. రెండోది ఎండిన ఖర్జూరాలు. ఎండిన ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి ఉదయం తింటే ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్జూరాలతో కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా చర్మం, జట్టు సమస్యల్ని కూడా తగ్గించుకోవచ్చు. అయితే ఇవి కేవలం సీజనల్ వారీగానే లభ్యమవుతాయి. కానీ వీటిని ప్రిజర్వేట్ చేసి అన్ని కాలాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఖర్జూరాలను రోజూ తినొచ్చా.. తింటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
రోజూ రెండు ఖర్జూరాలను తినడం వల్ల రక్త హీనత సమస్య అదుపులోకి వస్తుంది. ఖర్జూరాల్లో ఐరన్ కంటెంట్, విటమిన్ సి మెండుగా లభ్యమవుతాయి కాబట్టి.. వీటిని తింటే రక్త హీనత లోపం నుంచి బయట పడొచ్చు. నానబెట్టిన ఖర్జూరాలైనా తినొచ్చు.
అధిక రక్త పోటు.. గుండె పోటు, జబ్బులకు కారణం అవుతుంది. ఖర్జూరాల్లో మెగ్నీషియం, పొటాషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్త పోటును నియంత్రించడానికి బాగా సహాయ పడుతుంది. అంతే కాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది.
ఖర్జూరాల్లో ఫాస్పరస్, క్యాల్షియం, మెగ్నీషియం లభిస్తాయి కనుక.. వీటిని తింటే ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. అంతే కాకుండా ఎముకలకు వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి.
ఖర్జూరాల్లో మెగ్నీషియం, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడులోని ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అదే విధంగా తెలివి తేటలను కూడా పెంచుతాయి. ఖర్జూరాలు తింటే బ్రెయిన్ యాక్టీవ్‌గా ఉంటుంది. పిల్లలకు ఇవ్వడం చాలా మంచిది.
ప్రతి రోజూ ఖర్జూరాలను తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు జుట్టు రాలకుండా, చర్మం అందంగా మెరిసేలా చేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.