Home Tips: ఇలా చేశారంటే ఇంట్లో మంచి సువాసన వస్తుంది..

|

Jun 18, 2024 | 7:19 PM

ఇల్లు శుభ్రంగా ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకుంటుంది. దీంతో ఎంతో ఆనందంగా ఉంటుంది. అయితే ఒక్కోసారి ఇంట్లోంచి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. ఎంత శుభ్రంగా ఉంచినా, క్లీన్ చేసినా కూడా బాత్ రూమ్‌లో, వంట గదిలో ఏదో ఒక లాంటి వాసన వస్తుంది. దీంతో మంచి సువాసన రావాలని చాలా మంది రూమ్ ఫ్రెష్‌నర్స్‌..

Home Tips: ఇలా చేశారంటే ఇంట్లో మంచి సువాసన వస్తుంది..
Home Tips
Follow us on

ఇల్లు శుభ్రంగా ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకుంటుంది. దీంతో ఎంతో ఆనందంగా ఉంటుంది. అయితే ఒక్కోసారి ఇంట్లోంచి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. ఎంత శుభ్రంగా ఉంచినా, క్లీన్ చేసినా కూడా బాత్ రూమ్‌లో, వంట గదిలో ఏదో ఒక లాంటి వాసన వస్తుంది. దీంతో మంచి సువాసన రావాలని చాలా మంది రూమ్ ఫ్రెష్‌నర్స్‌ ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి మంచి సువాసన వస్తున్నప్పటికీ.. వీటిని కెమికల్స్ తో తయారు చేస్తారు. కాబట్టి వీటిని ఎక్కువగా ఉపయోగించకూడదు.

తక్కువ ఖర్చుతోనే రూమ్ ఫ్రెష్ నర్..

ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అస్సలు వినియోగించకూడదు. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మంచి రూమ్ ఫ్రెష్ నర్స్ తయారు చేసుకోవచ్చు. వీటితో మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. వీటికి చాలా తక్కువ ఖర్చే అవుతుంది. ఈ హోమ్ మేడ్ రూమ్ ఫ్రెష్ నర్స్‌కి కావాల్సినవి రెండే రెండు పదార్థాలు. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం.

ఈ రెండింటితో ఇల్లు సువాసన మాయం..

ఈ హోమ్ మేడ్ రూమ్ ఫ్రెష్ నర్ కోసం రాళ్ల ఉప్పు, కంఫర్ట్ ప్యాకెట్ కావాలి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి కొద్దిగా ఉప్పు తీసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక కంఫర్ట్ ప్యాకెట్ మొత్తం వేసి కలపండి. మీకు దుర్వాసన ఎక్కువగా వచ్చే ప్రదేశంలో ఈ గిన్నె ఉంచండి. కొద్ది నిమిషాల్లోనే దుర్వాసన మాయమై.. మంచి సువాసన వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇంట్లో వాళ్ల మూడే మారిపోతుంది..

కేవలం దుర్వాసన వచ్చినప్పుడే కాకుండా.. ప్రతి రోజూ ఇంట్లో ఇలా తయారు చేసి ఓ మూలన ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది. ఇంట్లోకి వచ్చినవారు కూడా రి ఫ్రెష్ ఫీల్ అవుతారు. అంతేకాకుండా ఉప్పు కాబట్టి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బయట నుంచి అలసిపోయి ఇంటికి వచ్చినవారి ముఖంపై చిరు నవ్వు వస్తుంది. మీ ఇంట్లో మనుషుల మూడే మారిపోతుంది. మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..