Broccoli vs Cauliflower: బ్రోకలీ vs కాలీఫ్లవర్.. వీటిల్లో ఆరోగ్యానికి ఏది బెస్ట్ అంటే..

|

Dec 19, 2024 | 4:48 PM

కాలీ ఫ్లవర్, బ్రోకలీ రెండూ ఆరోగ్యానికి మంచిదే. అయితే విదేశీయులు ఎక్కువగా బ్రోకలీ ఉపయోగిస్తారు. ఇక్కడ కాలీ ఫ్లవర్‌ని తీసుకుంటూ ఉంటారు. ఈ రెండింటిలో కూడా పోషకాలు అనేవి ఇంచుమించు సమానంగానే ఉంటాయి. మీ ఆరోగ్య దృష్టిని బట్టి, మీకు అందుబాటులో ఉండే వాటిని బట్టి తీసుకోవడం మేలుజ

Broccoli vs Cauliflower: బ్రోకలీ vs కాలీఫ్లవర్.. వీటిల్లో ఆరోగ్యానికి ఏది బెస్ట్ అంటే..
Broccoli Vs Cauliflower
Follow us on

ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు ఖచ్చితంగా అవసరం. ఎక్కువగా వెజిటేబుల్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఆహార నిపుణులు చెబుతూ ఉంటారు. హెల్దీ వెజిటేబుల్స్‌లో బ్రోకలీ, కాలీ ఫ్లవర్ కూడా ఉంటాయి. ఈ రెండూ ఒకే జాతికి చెందినవి. కానీ రంగులు వేరు అంతే. ఈ రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే కాలీ ఫ్లవర్ కంటే బ్రోకలీ ఖరీదు ఎక్కువ. బ్రోకలీని ఎక్కువగా విదేశీయులు తింటూ ఉంటారు. బ్రోకలీని వినియోగం ఇండియాలో చాలా తక్కువ. వీటిల్లో అనేక రకాల పోషకాలు మనకు లభిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో, దీర్ఘకాలిక వ్యాధుల్ని దూరం చేయడంలో ఇవి ఎంతో హెల్ప్ చేస్తాయి. మరి ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఆరోగ్యానికి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కాలీ ఫ్లవర్:

కాలీ ఫ్లవర్‌ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది వీటితోనే ఎక్కువగా రకరకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. ఇందులో శరీరానికి అవసరం అయిన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. కాలీఫ్లవర్ ప్రతి రోజూ తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిదే. రోగ నిరోధక శక్తిని పెంచడంలో, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్త సరఫరా సక్రమంగా చేయడంలో కాలీఫ్లవర్ ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇందులో క్యాలరీలు కూడా చాలా తక్కువ. కాబట్టి బరువు తగ్గాలన్నా కాలీ ఫ్లవర్ కంట్రోల్ చేస్తుంది.

బ్రోకలీ:

బ్రోకలీ అనేది పోషకాలకు హౌస్‌గా చెబుతారు. పచ్చి బ్రోకలీని కూడా శుభ్రంగా వాష్ చేసి.. సలాడ్స్ వంటి వాటిల్లో యాడ్ చేసుకుని తినేయవచ్చు. బ్రోకలీలో విటమిన్లు ఎ, సి, కె, ఫోలేట్, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ఖనిజాలు లభిస్తాయి. శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంలో, జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో కూడా బ్రోకలీ ఎంతో చక్కగా పని చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన కంట్రోల్ చేయడంలో కూడా బ్రోకలీ సహాయ పడుతుంది. బ్రోకలీ తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. డయాబెటీస్, బీపీని కూడా అదుపులో ఉంచుతుంది. బరువును కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

ఏది బెటర్:

కాలీ ఫ్లవర్‌, బ్రోకలీ రెండూ ఆరోగ్యానికి చాలా మంచివే. విటమిన్ సి ఎక్కువగా కావాలి అనుకునేవారు బ్రోకలీ తినడం మేలు. మిగతా పోషకాలన్నీ రెండింటిలో సమానంగానే ఉంటాయి. కాబట్టి ధరను బట్టి తీసుకోవాలి అనుకుంటే కాలీ ఫ్లవర్ తీసుకోవచ్చు. ఇది అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.