AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Tumor: ఏటా పెరుగుతున్న పిల్లల బ్రెయిన్ ట్యూమర్ కేసులు.. ఈ లక్షణాలు కనిపిస్తే విస్మరించవద్దని హెచ్చరిక

పిల్లలలో కణితులు పెద్దల ట్యూమర్ కంటే భిన్నంగా ఉంటాయి. వీటిని గ్లియోమాస్ అంటారు. పిల్లలలో కణితుల ప్రారంభ లక్షణాలను తల్లిదండ్రులు విస్మరిస్తారు. అటువంటి పరిస్థితిలో వ్యాధి సకాలంలో గుర్తించరు. ఈ కారణంగా చాలా సందర్భాలలో పిల్లల పరిస్థితి క్షీణించవచ్చు. ఏటా 4 వేల మంది చిన్నారులు బ్రెయిన్ ట్యూమర్ బాధితులవుతున్నారని ఫోర్టిస్ హాస్పిటల్ న్యూరాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ గుప్తా తెలిపారు. వ్యాధి ప్రారంభంలో గుర్తించడం లేదని చెబుతున్నారు

Brain Tumor: ఏటా పెరుగుతున్న పిల్లల బ్రెయిన్ ట్యూమర్ కేసులు.. ఈ లక్షణాలు కనిపిస్తే విస్మరించవద్దని హెచ్చరిక
Child Brain Tumor
Surya Kala
|

Updated on: Jun 11, 2024 | 8:21 PM

Share

వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ ట్యూమర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని ప్రజల్లో నమ్మకం. అయితే ఈ నమ్మకంలో నిజం లేదు.. చిన్న పిల్లలు కూడా అరుదైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. పిల్లల మెదడులో కణజాలం అధికంగా పెరిగితే మెదడులో కణితి పెరుగుతోంది. ఈ పిల్లలలో కణితులు పెద్దల ట్యూమర్ కంటే భిన్నంగా ఉంటాయి. వీటిని గ్లియోమాస్ అంటారు. పిల్లలలో కణితుల ప్రారంభ లక్షణాలను తల్లిదండ్రులు విస్మరిస్తారు. అటువంటి పరిస్థితిలో వ్యాధి సకాలంలో గుర్తించరు. ఈ కారణంగా చాలా సందర్భాలలో పిల్లల పరిస్థితి క్షీణించవచ్చు.

ఏటా 4 వేల మంది చిన్నారులు బ్రెయిన్ ట్యూమర్ బాధితులవుతున్నారని ఫోర్టిస్ హాస్పిటల్ న్యూరాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ గుప్తా తెలిపారు. వ్యాధి ప్రారంభంలో గుర్తించడం లేదని చెబుతున్నారు. దీనికి కారణం పిల్లలకి బ్రెయిన్ ట్యూమర్ వంటి తీవ్రమైన వ్యాధి రాదని ఎక్కువ మంది నమ్ముతారు. అయితే ఈ నమ్మకం కరెక్ట్ కాదు.. ఇందులో ఏ మాత్రం నిజం లేదని చెప్పారు.

పిల్లలు కూడా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి బారిన పడతారు. అయితే బ్రెయిన్ ట్యూమర్‌కు సకాలంలో చికిత్స చేస్తే.. ఈ వ్యాధి నుంచి చాలా ఈజీగా కోలుకోవచ్చు. అదే సమయంలో సకాలంలో వ్యాధిని గురించాకుండా సమయానికి చికిత్స చేయకపోతే.. అనేక సమస్యలను కలిగిస్తుంది. ఒకొక్కసారి ప్రాణాపాయం కూడా కలుగుతుంది. కనుక తల్లిదండ్రులు తమ పిల్లలలో కొన్ని లక్షణాలు కనిపిస్తే వాటిని విస్మరించవద్దని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. లక్షణాలు గుర్తించి సకాలంలో చికిత్సనందించేలా చేయమని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పిల్లలలో మెదడు కణితికి సంబంధించిన లక్షణాలు

  1. అతి నిద్ర
  2. ఉదయం తీవ్రమైన తలనొప్పి
  3. చేతులు, కాళ్ళలో బలహీనత
  4. వినికిడి సమస్య
  5. మాట్లాడటానికి ఇబ్బంది
  6. దృష్టి లోపం.. లేదా మసకగా కనిపించడం

చికిత్స ఏమిటి

పిల్లల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్ కు అనేక విధాలుగా చికిత్స అందిస్తున్నామని డాక్టర్ ప్రవీణ్ వివరించారు. ముందుగా కణితి ఎంత పరిమాణంలో ఉందో తెలుసుకోవాలి. సైజు పెద్దగా ఉంటే ముందుగా కీమో, ఇమ్యునోథెరపీ ద్వారా తగ్గించి ఆ తర్వాత సర్జరీ చేస్తారు. కణితి చిన్నదైతే వివిధ రకాల చికిత్సలతో అది తొలగించవచ్చు. కొన్ని సందర్భాల్లో రేడియేషన్ థెరపీని కూడా ఉపయోగిస్తారు, తద్వారా కణితి క్యాన్సర్ అయితే.. దాని కణాలు పెరగకుండా ఆపవచ్చు. శస్త్రచికిత్స చేయలేని ప్రదేశంలో కణితి ఉన్నప్పుడు కూడా ఈ రకమైన చికిత్స ఉపయోగిస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..