AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Billa Ganneru: మ్యాజిక్ చేసే బిళ్ళ గన్నేరు పూలు.. బీపీ, షుగర్‌ రెండూ కంట్రోల్..

బిళ్ల గన్నేరు పూల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పూలు రోడ్ల పక్కన, ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఈ పూలు చాలా రకాల్లో ఉంటాయి. వీటిని ఎక్కువగా పూజలకు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఈ చెట్టు, పూలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా ఈ బిళ్ల గన్నేరు పూలకు అనేక సమస్యలను నివారించేందుకు ఉపయోగిస్తారు. చూడటానికి కూడా ఎంతో అందంగా కనిపిస్తాయి. వీటితో దీర్ఘకాలిక సమస్యలను..

Billa Ganneru: మ్యాజిక్ చేసే బిళ్ళ గన్నేరు పూలు.. బీపీ, షుగర్‌ రెండూ కంట్రోల్..
Billa Ganneru
Chinni Enni
|

Updated on: Jul 12, 2024 | 3:27 PM

Share

బిళ్ల గన్నేరు పూల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పూలు రోడ్ల పక్కన, ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఈ పూలు చాలా రకాల్లో ఉంటాయి. వీటిని ఎక్కువగా పూజలకు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఈ చెట్టు, పూలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా ఈ బిళ్ల గన్నేరు పూలకు అనేక సమస్యలను నివారించేందుకు ఉపయోగిస్తారు. చూడటానికి కూడా ఎంతో అందంగా కనిపిస్తాయి. వీటితో దీర్ఘకాలిక సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. రెగ్యులర్‌గా ఉపయోగిస్తే.. దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, బీపీ, క్యాన్సర్, పీరియడ్స్ సమస్యలను కూడా అదుపు చేస్తాయి. మరి వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ కంట్రోల్:

ప్రస్తుత కాలంలో చాలా మంది షుగర్ సమస్యతో బాధ పడుతూ ఉంటున్నారు. డయాబెటీస్‌ను కంట్రోల్ చేసేందుకు.. బిళ్ళ గన్నేరు పూలను ఆరబెట్టి పొడిలా తయారు చేసుకోవాలి. ఈ పొడిని ప్రతి రోజూ ఒక గ్లాసు గోరు వెచ్చటి నీళ్లు లేదా పాలు, ఫ్రూట్ జ్యూస్‌లలో కలిపి ఖాళీ పొట్టతో తీసుకుంటే.. రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.

అదే విధంగా షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసేందుకు బిళ్ల గన్నేరు పూలు కూడా ఎంతో చక్కగా పని చేస్తాయి. ప్రతి రోజూ మూడు ఈ చెట్టు ఆకులను నమలడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే తాజా పూలని రాత్రి పూట నీటిలో వేసి ఉదయం వడకట్టి తాగితే మంచి ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బీపీ కంట్రోల్:

ఈ బిల్ల గన్నేరు ఆకులతో హై బీపీని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రతి రోజూ 5 తాజా ఆకుల్ని తీసుకుని మెత్తగా చేసి రసం తీయాలి. ఈ రసాన్ని రెండు, మూడు లీటర్ల నీటిలో కలుపుకుని తిగితే బీపీ కంట్రోల్ అవుతుంది.

పీరియడ్స్:

చాలా మందిలో పీరియడ్స్ అనేవి ఇ రెగ్యులర్‌గా వస్తాయి. అవి కూడా ఎప్పుడు వస్తాయో తెలీదు. ఇలాంటి వాళ్లు ఈ పూలతో కషాయాన్ని తయారు చేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ పూలను నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిని తాగితే పీరియడ్స్‌ రెగ్యులర్‌గా వస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే
విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే
ట్విస్ట్ ఇచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా రివర్స్
ట్విస్ట్ ఇచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా రివర్స్
కోపంతో తిరగబడిన నాగుపామును ఎప్పుడైనా చూశారా..?
కోపంతో తిరగబడిన నాగుపామును ఎప్పుడైనా చూశారా..?
మటన్ Vs చికెన్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? తప్పనిసరిగా..
మటన్ Vs చికెన్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? తప్పనిసరిగా..