Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Food for Hypertension: శీతాకాలంలో అందుకే బ్లడ్‌ ప్రెజర్ పెరుగుతుంది.. జీవనశైలిలో ఈ మార్పులు చేసుకున్నారంటే

చలికాలం వచ్చిందంటే కుటుంబంలోని చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఏదో ఒక వ్యాధితో బాధపడుతుంటారు. ఏడాది పొడవునా యాంటిడిప్రెసెంట్స్ తీసుకునే వారు కూడా ఈ సీజన్‌లో వ్యాధులతో పొరాడవల్సి ఉంటుంది. చలికాలంలో ఉష్ణోగ్రత పడిపోవడంతో శరీరంలోని సిరలు, ధమనులు కుంచించుకుపోతాయి. శరీర ఉష్ణోగ్రత, రక్త ప్రసరణను నిర్వహించడానికి శరీరం అదనపు శక్తిని ఉపయోగించవల్సి ఉంటుంది. ఫలితంగా రక్తపోటు పెరిగే అవకాశం ఉంటంఉది. ఇప్పటికే అధిక రక్తపోటుతో..

Winter Food for Hypertension: శీతాకాలంలో అందుకే బ్లడ్‌ ప్రెజర్ పెరుగుతుంది.. జీవనశైలిలో ఈ మార్పులు చేసుకున్నారంటే
Winter Food For Hypertension
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 18, 2023 | 12:47 PM

చలికాలం వచ్చిందంటే కుటుంబంలోని చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఏదో ఒక వ్యాధితో బాధపడుతుంటారు. ఏడాది పొడవునా యాంటిడిప్రెసెంట్స్ తీసుకునే వారు కూడా ఈ సీజన్‌లో వ్యాధులతో పొరాడవల్సి ఉంటుంది. చలికాలంలో ఉష్ణోగ్రత పడిపోవడంతో శరీరంలోని సిరలు, ధమనులు కుంచించుకుపోతాయి. శరీర ఉష్ణోగ్రత, రక్త ప్రసరణను నిర్వహించడానికి శరీరం అదనపు శక్తిని ఉపయోగించవల్సి ఉంటుంది. ఫలితంగా రక్తపోటు పెరిగే అవకాశం ఉంటంఉది. ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వెచ్చని బట్టలు ధరించడం, యోగా చేయడం వంటి చిన్న చిన్న జీవనశైలి మార్పులు చేయడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా తినడం, తాగడం వంటి ఆహార అలవాట్ల ద్వారా కూడా అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫలితంగా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

మెంతికూర

మెంతి గింజలు లేదా మెంతి ఆకుకూరలు శీతాకాలంలో ఏది తిన్నా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మెంతి కూరలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.

బిట్‌రూట్

ప్రతిరోజూ ఈ కూరగాయలను కూర లేదా జ్యూస్‌ ఏవిధంగా తీసుకున్నా కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. నాడీ వ్యవస్థ కూడా చురుకుగా పనిచేస్తుంది. బీట్‌రూట్ దుంపలోని యాంటీ ఆక్సిడెంట్, బి విటమిన్లు అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అంతేకాకుండా దుంపలు తినడం ద్వారా ఉత్పత్తి అయ్యే నైట్రిక్ ఆక్సైడ్ శరీరంలో రక్త ప్రసరణను నిర్వహిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆరెంజ్‌లు

శీతాకాలంలో ఆరెంజ్‌ పండ్లు అధికంగా పండుతాయి. ఆరెంజ్‌ పండ్లు తినడం ద్వారా అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ పండులో ఉండే మెగ్నీషియం, విటమిన్ B6 రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

ముల్లంగి

ముల్లంగి తినడం వల్ల కడుపులో గ్యాస్ వస్తుందని చాలా మంది భయపడుతుంటారు. ముల్లంగి తినడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ శీతాకాలపు కూరగాయ రక్తపోటును తగ్గించడంలో, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది.

శీతాకాలపు ఆకు కూరలు

ఈ సీజన్‌లో లభించే పాలకూర, క్యాబేజీ వంటి శీతాకాలపు కూరగాయలు రక్తపోటును తగ్గించడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఉపయోగపడతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.