Body Lotion: సింపుల్‌గా ఇంట్లోనే బాడీ లోషన్ ఇలా తయారు చేసుకోవచ్చు.. ఏమేం కావాలంటే
చలికాలంలో చర్మం పొడిబారుతుంది. తేమ లేకపోవడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. మాయిశ్చరైజర్ ఉపయోగించకపోతే చర్మం నిర్జీవంగా మారుతుంది. చలికాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ఎదుర్కొంటారు. మార్కెట్లో వివిధ రకాల మాయిశ్చరైజర్లు, బాడీ లోషన్లు అందుబాటులో ఉంటాయి. వీటిని చేతులు, కాళ్ళకు ఉపయోగిస్తారు. అయితే బాడీ లోషన్, ఫేస్ క్రీమ్ ఈ రెండూ భిన్నంగా ఉంటుంది. కమర్షియల్ బాడీ లోషన్లు చర్మంపై ఎక్కువ కాలం ప్రభావం చూపవు. మాయిశ్చరైజర్ కేవలం ఒక వాష్‌తో పోతుంది..
Updated on: Dec 18, 2023 | 12:25 PM

చలికాలంలో చర్మం పొడిబారుతుంది. తేమ లేకపోవడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. మాయిశ్చరైజర్ ఉపయోగించకపోతే చర్మం నిర్జీవంగా మారుతుంది. చలికాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ఎదుర్కొంటారు. మార్కెట్లో వివిధ రకాల మాయిశ్చరైజర్లు, బాడీ లోషన్లు అందుబాటులో ఉంటాయి.

వీటిని చేతులు, కాళ్ళకు ఉపయోగిస్తారు. అయితే బాడీ లోషన్, ఫేస్ క్రీమ్ ఈ రెండూ భిన్నంగా ఉంటుంది. కమర్షియల్ బాడీ లోషన్లు చర్మంపై ఎక్కువ కాలం ప్రభావం చూపవు. మాయిశ్చరైజర్ కేవలం ఒక వాష్‌తో పోతుంది. అంతేకాకుండా కమర్షియల్ బాడీ లోషన్లు రసాయన పదార్ధాలతో తయారు చేయబడతాయి. ఇవి చర్మానికి అంత ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు.

అలోవెరా, విటమిన్ ఇ క్యాప్సూల్స్, కొబ్బరినూనె, బాదం నూనె ఉంటే బాడీలోషన్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా ఖర్చుకాకుండా ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.

1/2 కప్పు చొప్పున కొబ్బరి నూనె, బాదం నూనె తీసుకోవాలి. అందులో 1 టీస్పూన్ అలోవెరా జెల్ కలపాలి. అందులో 1 విటమిన్ ఇ క్యాప్సూల్ కూడా వేసుకోవలి. అందులే ఏదైనా అసెన్షియల్ ఆయిల్ చుక్కలు 5 వేసుకోవలి. ఈ పదార్థాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ హోంమేడ్ బాడీ లోషన్‌తో బాటిల్‌లో నింపుకుంటే సరి. స్నానం చేసిన తర్వాత ఇంట్లో తయారుచేసిన ఈ బాడీ లోషన్‌ను శరీరమంతా అప్లై చేసుకోవచ్చు. దీనిలోని కొబ్బరి నూనె, బాదం నూనె మీ చర్మం తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి.

అలోవెరా జెల్ చర్మాన్ని ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది. విటమిన్ ఇ ఆయిల్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.





























