Vastu Tips: మంచి మార్కులు రావాలంటే.. ఈ దిశలో కూర్చొని చదవండి..!
వాస్తు శాస్త్రం ప్రకారం చదువు గదిలో సరైన దిశను అనుసరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. విద్యార్థులు ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్యం వైపుగా కూర్చొని చదివితే మంచి ఫలితాలను పొందగలరు. అశుభమైన ప్రదేశాల్లో చదవడం ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. చదువుపై దృష్టిని కేంద్రీకరించేందుకు వాస్తు నియమాలను పాటించడం ఎంతో ఉపయోగకరం.

విద్యార్థుల చదువుకు వాతావరణం ఎంతో ప్రభావం చూపుతుంది. సరైన ప్రదేశంలో కూర్చుని చదవడం చక్కటి దిశను అనుసరించడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని దిశల్లో కూర్చుని చదివితే జ్ఞానాన్ని శక్తివంతంగా గ్రహించగలుగుతారు. దీని ద్వారా మెదడు చురుగ్గా పనిచేసి చదివిన విషయాలు మెదడులో నిలిచిపోతాయి. విద్యార్థులు తమ విద్యను మెరుగుపరుచుకోవడానికి మంచి మార్కులు సాధించడానికి కొన్ని వాస్తు నియమాలను పాటించడం ఎంతో ఉపయోగకరం.
ఉత్తరం జ్ఞానం, విజ్ఞానం పెరిగే దిశగా భావించబడుతుంది. విద్యార్థులు ఉత్తర దిశలో కూర్చుని చదవడం వల్ల వారి ఏకాగ్రత పెరిగి అధ్యయనంలో మెరుగైన ఫలితాలు సాధించగలరు. ఈ దిశను అనుసరించడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేసి చదివిన అంశాలు సులభంగా గుర్తుండిపోతాయి. ముఖ్యంగా కఠినమైన విషయాలను అర్థం చేసుకోవడానికి ఉత్తర దిశ ఎంతో సహాయపడుతుంది.
తూర్పు దిశను సూర్యుడి శక్తికి సంబంధించినదిగా భావిస్తారు. ఈ దిశ విద్యార్థులకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తూర్పు వైపు చూస్తూ చదివితే చదువుపై మనస్సు మరింత ఏకాగ్రత సాధిస్తుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు, సైన్స్, గణిత శాస్త్రాలను చదువుతున్నవారు ఈ దిశలో చదవడం వల్ల మంచి ఫలితాలను పొందగలరు.
ఈశాన్యం దిశను దైవతం కలిగిన దిశగా పరిగణిస్తారు. విద్యార్థులు ఈ దిశలో కూర్చుని చదివితే మంచి ప్రభావం కలుగుతుంది. దేవతల అనుగ్రహం లభించడంతో పాటు మెదడు ప్రశాంతంగా ఉండి చదివిన విషయాలు సులభంగా గుర్తుంటాయి. మంచి మార్కులు సాధించాలనుకునే విద్యార్థులు ఈ దిశలో చదవడం ద్వారా తమ ఏకాగ్రతను పెంచుకోవచ్చు.
ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశల్లో చదవడం సాధ్యం కాకపోతే విద్యార్థులు పడమర దిశను కూడా అనుసరించవచ్చు. ఈ దిశలో చదవడమే తప్పుగా ఏమీ లేదు. అయితే ఈ దిశలో చదివేటప్పుడు గదిలో సరైన వెలుతురు, శుభ్రత ఉండేలా చూసుకోవాలి. చదువుకునే ప్రదేశాన్ని నిరాడంబరంగా, ప్రశాంతంగా ఉంచుకుంటే విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం విద్యార్థులు దక్షిణ దిశలో కూర్చుని చదవడం మంచిది కాదు. ఈ దిశ ప్రతికూల శక్తిని పెంచుతుందని భావిస్తారు. దీనివల్ల ఏకాగ్రత తగ్గిపోవడం చదివిన విషయాలు సరిగ్గా గుర్తుపట్టకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దక్షిణం వైపు చదవడం విద్యార్థుల మానసిక స్థితిని ప్రభావితం చేసి చదువులో అవరోధాలు కలిగించే అవకాశముంది.
చదువుకునే గది ఎప్పుడూ పరిశుభ్రంగా, కాంతివంతంగా ఉండాలి. గదిలో వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. గదిలో స్వచ్ఛమైన గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవడం ముఖ్యం. చదువుకునే ప్రదేశంలో అశుభప్రదమైన వస్తువులు లేకుండా గమనించాలి. చదువు గదిలో విద్యకు సంబంధిత చిత్రాలను, పుస్తకాలను ఉంచడం సానుకూల ఫలితాలను కలిగిస్తుంది. చదువుకునే టేబుల్ గోడకు ఆనించి ఉంచితే మంచిది. గదిలో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మంచి శక్తులు వ్యాపిస్తాయి.
విద్యార్థులు ఈ వాస్తు నియమాలను పాటిస్తే మెరుగైన ఏకాగ్రతను, మంచి జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. మంచి మార్కులు సాధించాలనుకునేవారు చదువుపై దృష్టి కేంద్రీకరించాలనుకునేవారు ఈ నియమాలను పాటించడం ద్వారా విజయం సాధించవచ్చు.