Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు ప్రకారం ఈ దిశలో నిద్రించండి.. జీవితంలో ఊహించని అదృష్టం మీదే.!

నిద్ర మన ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు ఎంతో ముఖ్యమైనది. అయితే మనం నిద్రించే దిశ కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వాస్తు ప్రకారం సరైన దిశలో నిద్రిస్తే శరీరంలో శక్తి సమతుల్యతగా ఉండి మంచి ఆరోగ్యం పొందవచ్చు. అయితే తప్పు దిశలో నిద్రిస్తే ఒత్తిడి, అలసట, అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.

వాస్తు ప్రకారం ఈ దిశలో నిద్రించండి.. జీవితంలో ఊహించని అదృష్టం మీదే.!
Best Sleeping Directions
Follow us
Prashanthi V

|

Updated on: Mar 25, 2025 | 3:31 PM

నిద్ర ఆరోగ్యానికి ఎంతో కీలకం. మనం నిద్రపోయే స్థలం, దిశ మన శరీరానికి, మనస్సుకు ప్రభావం చూపుతాయి. వాస్తు ప్రకారం సరైన దిశలో నిద్రిస్తే శరీరంలో సానుకూల శక్తి పెరుగుతుంది. ఆరోగ్యం, మానసిక శాంతి లభిస్తాయి. కానీ తప్పు దిశలో నిద్రిస్తే ఒత్తిడి, అలసట, అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వాస్తు ప్రకారం ఏ దిశలో నిద్రపోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

దక్షిణ దిశ

దక్షిణ దిశ వైపు తల పెట్టుకుని నిద్రపోవడం వాస్తు ప్రకారం అత్యంత ఉత్తమం. భూమి అయస్కాంత శక్తితో సమతుల్యత సాధించడంతో పాటు నిద్ర నాణ్యత మెరుగవుతుంది. దీని వల్ల శరీరం ఉత్తేజంగా ఉంటుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా కూడా ఇది చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

తూర్పు దిశ

తూర్పు దిశలో నిద్రించడం విద్యార్థులు, బుద్ధిజీవులకు అత్యంత అనుకూలం. ఈ దిశ బుద్ధి వికాసానికి తోడ్పడుతుంది. నిద్ర సరిగ్గా పట్టి, కొత్త విషయాలు సులభంగా అర్థం చేసుకునేలా చేస్తుంది. విజయం, సంపద, మంచిపేరు కావాలనుకునేవారు ఈ దిశలో నిద్రిస్తే మేలు జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

పడమర దిశ

ఈ దిశలో నిద్రించడం ద్వారా మితమైన ఫలితాలు లభిస్తాయి. తూర్పు లేదా దక్షిణం దిశలతో పోలిస్తే ఇది అంతగా ప్రయోజనకరం కాదు. కానీ ఈ దిశ స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఎవరైనా స్థిరమైన జీవితం కోరుకుంటే పడమర వైపు తల పెట్టుకుని నిద్రించవచ్చు.

ఉత్తర దిశ

వాస్తు ప్రకారం ఉత్తర దిశలో నిద్రించడం అనుకూలం కాదు. ఈ దిశలో నిద్రిస్తే ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర సరిగ్గా పట్టదు. ఇది ముఖ్యంగా వృద్ధులకు మంచిది కాదు. ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఉత్తర దిశలో నిద్రించకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ నియమాలు తప్పనిసరి

  • మాస్టర్ బెడ్ రూమ్.. ఇంటి నైరుతి మూలలో ఉండాలి. దీనివల్ల గృహంలో సౌభాగ్యం పెరుగుతుంది. బెడ్‌రూమ్‌ను ఈశాన్య దిశలో ఏర్పాటు చేయడం వల్ల అశాంతి ఏర్పడే అవకాశం ఉంది.
  • మంచం స్థానం.. మంచాన్ని ఇంటి ప్రధాన తలుపుకి ఎదురుగా ఉంచకూడదు. ఇది ప్రతికూల ప్రభావాన్ని కలిగించే అవకాశం ఉంది.
  • గది పరిశుభ్రత.. పడకగది ఎప్పుడూ శుభ్రంగా, క్రమంగా ఉండేలా చూసుకోవాలి. చెత్తాచెదారం గదిలో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది.
  • అద్దం స్థానం.. మంచానికి ఎదురుగా అద్దం ఉంచకూడదు. ఇది నిద్రలో ఆటంకం కలిగించడంతో పాటు సానుకూల శక్తిని దూరం చేస్తుంది.

సరైన దిశలో నిద్రించడం వల్ల జీవనశైలి మెరుగుపడుతుంది. వాస్తు నియమాలను పాటించడం వల్ల ఆరోగ్యం, సంపద, మానసిక ప్రశాంతత పొందొచ్చు. కాబట్టి మీరు నిద్రించే దిశను సరిచూసుకొని శ్రేయస్సును పొందండి.