Snake-Repellent Plants: ఇంట్లోకి పాములు వస్తాయని భయపడుతున్నారా? అయితే మీ ఇంటి చుట్టూ ఈ మొక్కలు నాటండి..

చెట్లు, మొక్కలు, ఆహారం లభించే ఇతర ప్రాంతాలకు వర్షాకాలంలో పాములు ఎక్కువగా రావడం చాలా సాధారణం. ఈ సీజన్‌లో పాములు రాకుండా నిరోధించడానికి ఇంటి కుండీలలో కొన్ని ప్రత్యేక మొక్కలను (స్నేక్-రిపెల్లెంట్ ప్లాంట్స్) పెంచవచ్చు. ఇలా చేయడం ద్వారా పాములు వాటి వాసన కారణంగా ఇంటి లోపలికి రాలేవు.

Snake-Repellent Plants: ఇంట్లోకి పాములు వస్తాయని భయపడుతున్నారా? అయితే మీ ఇంటి చుట్టూ ఈ మొక్కలు నాటండి..
Plants To Avoid Snakes

Updated on: Jun 16, 2025 | 1:58 PM

వర్షాకాలం మొదలైంది. వర్షా కాలంలో ఇంటి చుట్టూ విష పూరిత కీటకాలు రావడం సర్వసాధారణం. దానితో పాటు పాములు, వాటి పిల్లలు కూడా వస్తుంటాయి. పాములు ఇంటికి రావాలని దాదాపు ఈ ప్రపంచంలో ఎవరూ కోరుకోరు. కానీ అవి చెట్లు, మొక్కలు, ఆహారం లభించే ఇతర ప్రాంతాలకు వర్షాకాలంలో ఎక్కువగా రావడం చాలా సాధారణం. ఈ సీజన్‌లో పాములు రాకుండా నిరోధించడానికి ఇంటి కుండీలలో కొన్ని ప్రత్యేక మొక్కలను (స్నేక్-రిపెల్లెంట్ ప్లాంట్స్) పెంచవచ్చు. ఇలా చేయడం ద్వారా పాములు వాటి వాసన కారణంగా ఇంటి లోపలికి రాలేవు. ఇలాంటి మొక్కలను నాటడం ద్వారా పాములు రాకుండా నిరోధించవచ్చు. కాబట్టి ఏయే మొక్కలు నాటాలో ఇక్కడ తెలుసుకుందాం..

బంతి పువ్వు

సాధారణంగా చాలా మంది ఇళ్లలో సువాసన, అందం కోసం బంతి పువ్వు మొక్కలను నాటు తుంటారు. కానీ బంతి పువ్వులు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు పాములు రావు. పాములు వాటి నుండి వచ్చే వాసనను ఇష్టపడవని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవచ్చు.

వార్మ్వుడ్ మొక్క

ఈ వార్మ్‌వుడ్ మొక్కలను పెరట్లో లేదా మీ ఇంటి గార్డెన్‌ లేదా గార్డెన్‌ చుట్టూ పెంచవచ్చు. ఎందుకంటే పాములు ఎక్కడైనా దాక్కునే అవకాశం ఉంది. కాబట్టి మీ ఇంటి చుట్టూ పాములు ప్రవేశించకుండా ఈ మొక్కను అక్కడక్కడ నాటండి. ముఖ్యంగా పాముల బెడద ఎక్కువగా ఉన్న చోట, ఈ మొక్కలను తప్పకుండా పెంచాలి. ఈ మొక్క సువాసన పాములను తరిమికొడుతుంది. రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు పెరిగే ఈ మొక్కలు ఇంటి దగ్గర తేనెటీగలు పాకకుండా నిరోధిస్తాయి. దీనిని పెరట్లో లేదా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కూడా నాటవచ్చు.

ఇవి కూడా చదవండి

పాము వేరు

మీరు ఎప్పుడైనా పాము వేరు మొక్క గురించి విన్నారా? ఈ మొక్క సాధారణంగా చాలా వింతైన వాసన కలిగి ఉంటుంది. పాములు ఈ వాసనను భరించలేవు. సహజ లక్షణాలతో నిండిన ఈ మొక్క పసుపు, గోధుమ రంగులో ఉంటాయి. ఈ మొక్కలను ఇంటి చుట్టూ నాటడం వల్ల కూడా పాములు రాకుండా నిరోధించవచ్చు.

కాక్టస్ మొక్క

ముళ్ళతో కూడిన కాక్టస్ మొక్కలను మీరు చూసే ఉంటారు. ఇవి సాధారణంగా ఎడారులలో కనిపిస్తాయి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా, వీటిని అలంకార మొక్కలుగా ఇళ్లలోనూ ఉపయోగిస్తున్నారు. కానీ వాటికి ఎటువంటి సువాసన ఉండదు. వాటి ముళ్ళ స్వభావం కారణంగా పాములు వాటి చుట్టూ తిరగవు. కాబట్టి వాటిని కాంపౌండ్ దగ్గర పెంచడం చాలా అనుకూలంగా ఉంటుంది.

నిమ్మకాయ

సాధారణంగా పాములు నిమ్మగడ్డి వాసనను ఇష్టపడవు. కాబట్టి ఇవి నాటిన చోటికి పాములు రావు. ఇవి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి. అలాగే సరిగ్గా ఉపయోగిస్తే అవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.