AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైవాహిక జీవితంలో ఆనందానికి చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే!

ప్రస్తుత రోజుల్లో వైవాహిక జీవితంలో చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బంధంలో నమ్మకం, నిజాయితీ లేకపోవడం వలన బంధాలు విడిపోతున్నాయి. చాలా మంది తమ భాగస్వామి నుంచి విడాకులు కోరుకుంటున్నారు. అందుకే బంధం బలంగా ఉండాలంటే తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలి అంటున్నాడు ఆచార్య చాణక్యుడు. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 16, 2025 | 1:43 PM

Share
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గొప్ప పండితుడు. ఆచార్య చాణక్యుడు తన జీవితంలోని అనుభవాల ద్వారా  ఎన్నో నీతి సూత్రాలను తెలియజేశాడు. అవి నేటి తరం వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా చాణక్యడు బంధాలు, బంధుత్వాల గురించి చాలా బాగా వివరించాడు. అయితే చాణక్యుడు వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా బంధం బలంగా ఉండాలంటే ఏం చేయాలో తెలిపారు.

1 / 5
వైవాహిక జీవితం అనేది చాలా గొప్పది. ఈ బంధంలో భార్య భర్తలు ఇద్దరు చాలా నిజాయితీగా, నిజమైన ప్రేమను చూపిస్తూ బంధాన్ని కొనసాగించాలి. బంధం అనేది ఇద్దరి ప్రేమపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరిలో ఒక్కరు తమ భాగస్వామిపై నిజాయితీగా , షరతులు లేకుండా సంబంధాన్ని కొనసాగిస్తారో వారు తమ జీవితాన్ని ఆనందంగా, అద్భుతంగా గడుపుతారు. వారు 100 సంవత్సరాలు హాయిగా కలిసి జీవిస్తారని చెప్పారు.

2 / 5
భార్యభర్తల మధ్య ప్రతి సంభాషణ కూడా చాలా కీలకమైనది. జీవితంలో ఎప్పుడూ తన జీవిత భాగస్వామి గురించి ఇతరులకు అబద్ధం చెప్పకూడు. ఒక వేళ చెప్పినట్లైతే అది మీ వైవాహిక బంధంలో కలహాలకు కారణం అవుతుంది.  భార్యాభర్తలు ఒకరితో ఒకరు నిజాయితీగా మాట్లాడుకుని సత్యాన్ని సమర్థిస్తే, వారి మధ్య ఎప్పుడూ అపార్థాలు ఉండవు. నిజం బంధాన్ని బలపరుస్తుంది అంటున్నాడు చాణక్యుడు.

3 / 5
సంబంధంలో గౌరవం చాలా ముఖ్యం. జీవిత భాగస్వాములు ఒకరినొకరు గౌరవించుకుంటే, వైవాహిక బంధంలో గొడవలే రావు అంటున్నాడు ఆచార్య చాణక్యుడుః. గౌరవం లేకపోతే బంధం నిలబడదు. సంబంధాలలో చేదును సృష్టించి, వాటిని విచ్ఛిన్నం అంచుకు తీసుకురాగలదు. కాబట్టి, ఎప్పుడూ మీ భాగస్వామిక గౌరవం ఇస్తూనే ఉండండి అంటున్నాడు చాణక్యుడు.

4 / 5
జీవితం సాగాలి అంటే ఇద్దరూ కష్టపడాలి. కానీ ఒకరు కష్టపడి మరొరకు ఎలాంటి పని లేకుండా ఖాళీగా ఉంటూ.. కష్టం చేసిన వాడినే వేలెత్తి చూపించడం కూడా బంధం విచ్ఛిన్నం కావడానికి కారణం అవుతుంది అని చెప్తున్నాడు ఆచార్య చాణక్యుడు.

5 / 5