2 నిమిషాల్లో తలనొప్పిని తరిమికొట్టే సూపర్‌ డ్రింక్..! ఎలాంటి మందుల అవసరం లేదు..

మీకు కూడా ఈ సమస్య ఉంటే ఇకపై మాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, తలనొప్పి వచ్చిన ప్రతిసారీ మాత్రలు వేసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఇక్కడ మేం చెప్పబోయే ఈ స్పెషల్‌ డ్రింక్‌ తయారు చేసుకుని ప్రయత్నించండి. తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

2 నిమిషాల్లో తలనొప్పిని తరిమికొట్టే సూపర్‌ డ్రింక్..! ఎలాంటి మందుల అవసరం లేదు..
శరీరానికి అవసరమైన నిద్ర లేకపోవడం మెదడు కణాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది క్రమంగా జ్ఞాపకశక్తి బలహీనపడటానికి దారి తీస్తుంది. ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

Updated on: Sep 06, 2025 | 12:32 PM

చాలా మంది తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుంటారు. తలనొప్పి వచ్చినప్పుడల్లా మాత్రలు తప్పనిసరిగా వాడుతుంటారు. ముఖ్యంగా మైగ్రేన్ ఉన్నవారికి తరచుగా ఈ తలనొప్పి వేధిస్తూ ఉంటుంది. మీకు కూడా ఈ సమస్య ఉంటే ఇకపై మాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, తలనొప్పి వచ్చిన ప్రతిసారీ మాత్రలు వేసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఇక్కడ మేం చెప్పబోయే ఈ స్పెషల్‌ డ్రింక్‌ తయారు చేసుకుని ప్రయత్నించండి. తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

చాలా మంది తీవ్రమైన తలనొప్పితో అవస్థపడుతుంటారు. పని ఒత్తిడితో అలసిపోవడం వల్ల లేదా, ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల కూడా కొందరికి తలనొప్పి వస్తుంది. అదనంగా, మైగ్రేన్ ఉన్నవారికి తరచుగా తలనొప్పి వస్తుంది. తలనొప్పి వచ్చిన ప్రతిసారీ మాత్ర వేసుకోవడం మంచిది కాదు. మన వంటింట్లో లభించే కొన్ని రకాల ఆహార పదార్థాలతో తయారు చేసే ఒక స్పెషల్ టీ తాగటం వల్ల మీ తలనొప్పి నుండి కొన్ని నిమిషాల్లోనే ఉపశమనం లభిస్తుంది.

ఇందుకోసం తురిమిన అల్లం, చిటికెడు పసుపు, రెండు, మూడు మిరియాలు, కొంచెం కొత్తిమీర, ఒక గ్లాసు నీళ్లు… కొంచెం నిమ్మరసం తీసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక గ్లాసు నీళ్లు పెట్టి, ఒక చిన్న అల్లం ముక్క, చిటికెడు పసుపు, మిరియాలు, కాస్త కొత్తిమీర వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు దాన్ని వడకట్టి ఒక గ్లాసులో పోయాలి. కొంచెం నిమ్మరసం పిండాలి. తలనొప్పి వచ్చినప్పుడు ఈ రసం తాగితే ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us