Male Baldness: బట్టతల అంకుల్స్‌కి ఎగిరి గంతేసే న్యూస్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!

ఎంతో విలువైన జుట్టు కారణం లేకుండానే రాలిపోతుంటే నిస్సహాయంగా చూస్తూ కొందరు ఉసూరుమంటే.. మరికొందరు చాలా మంది బట్టతల వస్తుందని భయపడి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్‌ ప్రొడక్ట్స్‌ వాడి తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే రసాయనాలతో..

Male Baldness: బట్టతల అంకుల్స్‌కి ఎగిరి గంతేసే న్యూస్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
Essential Oils For Men Hair Health

Updated on: Apr 06, 2026 | 7:34 PM

నలభై ఏళ్లు దాటాక అద్దం ముందు నిలబడితే దాదాపు ప్రతి ఒక్కరి దృష్టి తలపై మిగిలిన నాలుగు వెంట్రుకలపైనే నిలుస్తుంది. సమస్య కేవలం వయసు మాత్రమే కాదని అందరికీ తెలుసు. ఎంతో విలువైన జుట్టు కారణం లేకుండానే రాలిపోతుంటే నిస్సహాయంగా చూస్తూ కొందరు ఉసూరుమంటే.. మరికొందరు చాలా మంది బట్టతల వస్తుందని భయపడి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్‌ ప్రొడక్ట్స్‌ వాడి తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే రసాయనాలతో కూడుకున్న సౌందర్య ఉత్పత్తులతో మేలుకి బదులు నష్టమే మరింత ఎక్కువగా ఉంటుంది. చిన్న వయసులోనే జుట్టు కుదుళ్లు బలహీనపడి, జుట్టు నెరవడం లేదా బట్టతల రావడం నేటి కాలంలో షరా మామూలై పోయింది. కాబట్టి కృత్రిమ సౌందర్య ఉత్పత్తులను వదిలిపెట్టి, ప్రకృతిలో సహజంగా దొరికే సుగంధ తైలాలు జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయగలవని ఆయుర్వేధ నిపుణులు అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

జుట్టు సంరక్షణ కోసం టాప్ 4 ఎసెన్షియల్‌ నూనెలు ఇవే..

జెరేనియం నూనె

తల చర్మం pH ను సమతుల్యం చేయడానికి జెరానియం నూనెకు ప్రత్యామ్నాయం లేదు. దీని శక్తివంతమైన యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు తల చర్మంపై దురద, ఇన్ఫెక్షన్‌ను తక్షణమే తగ్గిస్తాయి. 5 చుక్కల జెరానియం నూనెను 2 టీస్పూన్ల కొబ్బరి నూనెతో కలిపి పదిహేను నిమిషాల పాటు తలపై మసాజ్ చేయండి. ఆ తర్వాత అరగంట పాటు వదిలేసి తేలికపాటి షాంపూతో తల స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

టీ ట్రీ ఆయిల్

జుట్టు కుదుళ్లకు సరైన పోషణ అందించడానికి టీ ట్రీ ఆయిల్ చాలా మంచిది. దీనిలోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చుండ్రు సమస్యలను మూలం నుండే తొలగిస్తాయి. దీన్ని విడిగా అప్లై చేయడానికి మీకు సమయం లేకపోతే, రోజువారీ షాంపూ బాటిల్‌లో 10-15 చుక్కల టీ ట్రీ ఆయిల్‌ను కలపండి. స్నానం చేసేటప్పుడు షాంపూను అప్లై చేసి మూడు నిమిషాల పాటు శుభ్రంగా రుద్ది ఆ తర్వాత తల స్నానం చేయండి.

ఇవి కూడా చదవండి

పుదీనా ఎసెన్షియల్ ఆయిల్

రోజువారీ ఒత్తిడి, మానసిక ఆందోళన కూడా జుట్టు రాలడానికి గల కారణాలలో ఉన్నాయి. పుదీనా నూనె తల చర్మాన్ని చల్లగా ఉంచడమే కాకుండా రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. దీనివల్ల కొత్త జుట్టు పెరిగే అవకాశాలు పెరుగుతాయి.

లావెండర్ నూనె

అత్యంత గరుకుగా, నిర్జీవంగా ఉండే జుట్టు ఉన్నవారికి లావెండర్ నూనె చాలా అనువైనది. ఇది జుట్టుకు సహజమైన మెరుపును తిరిగి అందించి, తేమను నిలుపుతుంది. వారానికి కనీసం మూడు రోజులు కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల లావెండర్ నూనెను కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఇది కోల్పోయిన జుట్టు తిరిగి పొందడానికి సహాయపడుతుంది. కొద్దిపాటి అవగాహనతో సరైన సహజ పదార్థాలను ఉపయోగించడం ద్వారా మీ తలపై వెంట్రుకలను తిరిగి పొంది.. కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందవచ్చు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us