Anti Aging Habits: ఈ అలవాట్లు పాటిస్తే.. మీ ఏజ్ రివర్స్ అవుతుంది!

వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా వీలైనంతవరకు ఫిట్‌నెస్‌తో, అందంగా, ఆరోగ్యంగా ఉండాలని భావిస్తారు. కానీ, కాలం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఒక వయసు వచ్చాక శరీరం డల్ గా తయారవుతుంది. అయితే ఈ ఏజింగ్ ప్రాసెస్ ను కూడా కొంతవరకూ రివర్స్ చేయొచ్చంటున్నారు డాక్టర్లు అదెలాగంటే..

Anti Aging Habits: ఈ అలవాట్లు పాటిస్తే.. మీ ఏజ్ రివర్స్ అవుతుంది!
Anti Aging Habits

Updated on: Oct 27, 2025 | 6:19 PM

వయసుతోపాటు వచ్చే నిస్సత్తువ, చర్మంపై ముడతలు, కీళ్ల నొప్పులు, ఇతర అనారోగ్య సమస్య నుంచి ఎదుర్కోవాలంటే శరీరంలోని కణాలకు ముందు నుంచే పోషణ అందించాలి. శరీరంలోని ప్రతికణం జీవంతో ఉప్పొంగుతుంటే ఏజింగ్ అనేది ఆటోమేటిగ్గా పోస్ట్ పోన్ అవుతుంది.  ముఖ్యంగా డైలీ లైఫ్ లొ కొన్ని హ్యాబిట్స్ ను అలవాటు చేసుకోవడం ద్వారా ఏజింగ్ ప్రాసెస్ ను స్లో చేయొచ్చు అంటున్నారు డాక్టర్లు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

సన్‌ లైట్

శరీరానికి ఆహారం ద్వారానే కాదు సూర్య కాంతి ద్వారా కూడా పోషణ అందుతుందని తాజా స్టడీల్లో వెల్లడైంది. ముఖ్యంగా జీవ కణాలు హెల్దీగా ఉండాలంటే తగినంత సన్ ఎక్స్ పోజర్ ఉండాలి. సన్ నుంచి విటమిన్ డి కూడా లభిస్తుంది. ఇది కూడా ఏజింగ్ ప్రాసెస్ ను స్లో చేయడంలో హెల్ప్ చేస్తుంది.

పోషకాలు

రోజువారీ ఆహారంలో అన్నిరకాల విటమిన్లు, మినరల్స్ ఉండేలా చూసుకోవడం, ఎటువంటి విటమిన్ డిఫీషియన్సీలు రాకుండా చూసుకోవడం ద్వారా కణాలు ఎక్కువ కాలం పాటు హెల్దీగా ఉంటాయి. తద్వారా ఏజింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది.

డైలీ వర్కవుట్లు

ప్రతిరోజూ కనీసం 20 లేదా 30 నిముషాలు ఎక్సర్‌సైజ్‌ చేయడం ద్వారా గుండె పనితీరు, రక్త ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా షుగర్, బీపీ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. వయసు పైబడిన తర్వాత కూడా హెల్దీగా ఉండొచ్చు.

ప్రొటీన్‌

శరీరంలోని కండరాల పోషణకు ప్రొటీన్ చాలా ముఖ్యమైనది. క్యాలరీలు, షుగర్ కంటెంట్ కంటే ప్రొటీన్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రతిరోజూ నట్స్‌ వంటి హెల్దీ ప్రొటీన్స్ తప్పక తీసుకోవాలి.

నీళ్లు

ప్రతిరోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగాలని డాక్టర్లు చెప్తున్నారు. కనీసం రోజుకి 3 లీటర్ల నీరు అయినా తాగుతుండడం ద్వారా రక్తం, కిడ్నీలు, చర్మం హల్దీగా ఉంటాయి. వయసుతోపాటు వచ్చే సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..