AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skipping: రోజుకు 15 నిమిషాలు ఇలా చేశారంటే.. జిమ్‌కి వెళ్లకుండానే ఫిట్‌ బాడీ మీ సొంతం!

ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం, శారీరక దృఢత్వం కోసం.. రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. నడక, జాగింగ్, జిమ్, ఈత వంటి వ్యాయామాలతో పాటు, సరైన ఆహార అలవాట్లు అనుసరించడం కూడా చాలా ముఖ్యం. సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి. అయితే రోజుకు కేవలం 15 నిమిషాలు..

Skipping: రోజుకు 15 నిమిషాలు ఇలా చేశారంటే.. జిమ్‌కి వెళ్లకుండానే ఫిట్‌ బాడీ మీ సొంతం!
Skipping
Srilakshmi C
|

Updated on: Jun 18, 2025 | 12:48 PM

Share

ఆరోగ్యంగా ఉండటానికి రోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం, శారీరక దృఢత్వం కోసం.. రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. నడక, జాగింగ్, జిమ్, ఈత వంటి వ్యాయామాలతో పాటు, సరైన ఆహార అలవాట్లు అనుసరించడం కూడా చాలా ముఖ్యం. సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి. అయితే రోజుకు కేవలం 15 నిమిషాలు స్కిప్పింగ్‌ చేయడం వల్ల గంటల తరబడి వ్యాయామం చేయడం కంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి స్కిప్పింగ్‌ వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

స్కిప్పింగ్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

  • ప్రతిరోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్‌ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
  • రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల మెదడుపై కూడా సానుకూల ప్రభావం ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
  • ప్రతిరోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేయడం వల్ల ఎముకలు బలపడతాయి. గట్టిపడతాయి. ఇది ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారిస్తుంది.
  • స్కిప్పింగ్ కాళ్ళు, చేతులు, కండరాలను బలపరుస్తుంది. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
  • ప్రతిరోజూ కొద్దిసేపు స్కిప్పింగ్ సాధన చేయడం వల్ల శరీర సమతుల్యత మెరుగుపడుతుంది. నడుస్తున్నప్పుడు శరీరం స్థిరంగా ఉంటుంది. ఊగడం వంటి సమస్యలు ఉండవు.
  • ప్రతిరోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేయడం వల్ల స్టామినా కూడా రెట్టింపు అవుతుంది. అందువలన శారీరక శ్రమ సామర్థ్యం పెరుగుతుంది. ఫిట్‌నెస్ పెరుగుతుంది.
  • స్కిప్పింగ్ వల్ల ఎండార్ఫిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. తద్వారా మంచి మానసిక స్థితిని అందిస్తాయి.
  • ప్రతి సారి తాడును దూకుతున్నప్పుడు మెదడు పనిచేస్తూ ఉండటం వల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా ఆ సమయంలో మనం చేయాల్సిన పనిపై ఎక్కువ శ్రద్ధ చూపడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
  • స్కిప్పింగ్‌లో చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రారంభించినప్పుడు నెమ్మదిగా జంపింగ్ ప్రాక్టీస్ చేయాలి. మీ ఎత్తుకు సరిగ్గా సరిపోయేలా, గట్టి పట్టు ఉన్న తాడును ఎంచుకోవాలి. ఇది త్వరగా స్కిప్పింగ్ నేర్చుకోవడానికి సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.