AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: మట్టి పాత్రల్లో ఫుడ్ వండుకుంటే.. ఆరోగ్యం, ఆనందం..

ప్రజంట్ రకరకాల వ్యాధులు., వైరస్‌లు. మనుషులపైకి అటాక్ చేస్తున్నాయి. దీంతో ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి గతం వైపు చూస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆహారాన్ని వండడానికి సంప్రదాయ పాత్రలను ఉపయోగించడం ప్రారంభించారు. అందులో భాగమైన మట్టి పాత్రల్లో వండిన వంటకాలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

Health: మట్టి పాత్రల్లో ఫుడ్ వండుకుంటే.. ఆరోగ్యం, ఆనందం..
Clay Pot Cooking
Ram Naramaneni
|

Updated on: Mar 10, 2024 | 2:43 PM

Share

మన పూర్వికులు మట్టి కుండల్లో నిల్వ ఉంచిన నీరు తాగేవారు. అలానే మట్టి పాత్రల్లోనే వంట చేసుకునేవారు. కానీ కాలం గడిచేకొద్దీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో మట్టి పాత్రలు మూలనపడి నాన్ స్టిక్, స్టీలు, అల్యూమినియం తదితర పాత్రలు వంటగదిలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ పాత్రలలో ఆహారాన్ని చాలా త్వరగా వండుకోవచ్చు. కానీ ఆరోగ్య పరంగా ఇది అంత మంచిది కాదు. అవును, ఇటువంటి స్టీల్ పాత్రలు ఆహారంలోని పోషకాలను తగ్గించి , ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగిస్తాయి. ఆ విషయం తెలిసినా, నేటికీ దాదాపు అన్ని ఇళ్లలోనూ అలాంటి పాత్రల్లోనే వంట వండుతున్నారు.

ప్రజంట్ జనరేషన్.. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడటానికి బహుశా ఇదే కారణం కావచ్చు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మట్టి కుండల్లోనే వంట వండుకునేందుకు నిపుణులు చిట్కాలు చెబుతున్నారు. అలా కుక్ చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

పోషకాలను అందిస్తుంది:

నాన్ స్టిక్, అల్యూమినియం పాత్రల కంటే మట్టి కుండలు ఆరోగ్యానికి సురక్షితమైనవి. ఇనుము, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు మట్టి కుండలలో వండిన ఆహారంలో ఉంటాయి. ఇలాంటి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పొట్టలో ఎసిడిటీ రాదు.

 గుండెకు మంచిది:

మట్టి పాత్రల్లో వండిన ఆహారం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పాత్రలలో ఆహారాన్ని వండితే తక్కువ నూనె పడుతుంది. అందువల్ల మట్టి పాత్రలలో వండిన ఆహారాన్ని తినడం గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా చెబుతారు

డయాబెటిక్ పేషెంట్లకు మేలు చేస్తుంది:

షుగర్ ఉన్నవారు మట్టి కుండలలో వండిన ఆహారాన్ని తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మట్టి కుండలో ఆహారాన్ని నెమ్మదిగా, సరిగ్గా వండుతారు. ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి బ్యాలెన్స్ అవుతుంది. అంతేకాదు శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెరుగుతుంది.

మలబద్ధకం, కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం

మట్టి కుండలలో వండిన ఆహారం తినడం లేదా మట్టి కుండలలో నిల్వ ఉంచిన నీటిని తాగడం ద్వారా మలబద్ధకం అసిడిటీ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది జీర్ణక్రియ ప్రక్రియను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

pH స్థాయిని నిర్వహించడంలో సహాయపడుతుంది:

మీరు మట్టి కుండలో వండిన ఆహారాన్ని తింటే, అది pH స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. నిజానికి మట్టిలోని ఆల్కలీన్ స్వభావం ఆహారంలోని ఆమ్లంతో చర్య జరుపుతుంది, తద్వారా pH స్థాయి సమతుల్యం అవుతుంది.

ఆహారం  రుచిని పెంచుతుంది:

మట్టి పాత్రల్లో వండడం వల్ల దాని రుచి పూర్తిగా మారిపోతుంది. నిజానికి నేల ఆల్కలీన్ స్వభావం కలిగి ఉంటుంది. మట్టి కుండలు ఆహారంలోని పోషకాలను బయటకు పోకుండా చేస్తాయి. కాబట్టి ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా వంట రుచిని కూడా పెంచుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us