మసాలా జామకాయ.. నోరూరించే ఈ రెసిపీ ఇలా చేస్తే రోజే అదే కావాలంటారు!
Prasanna Yadla
20 February 2026
Pic credit - Pixabay
జామకాయలో ఎన్ని పోషకాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే వైద్యులు కూడా దీనిని తినమని చెబుతారు.
జామకాయ
జామకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే, శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
జామకాయ
జామకాయతో పచ్చడి మాత్రమే కాకుండా మసాలా కూడా తయారు చేసుకోవచ్చని తెలుసా.. అవును మీరు విన్నది నిజమే
జామకాయ మసాలా
3 జామకాయలు, ఒక ఉల్లిపాయలు, ఒక టమాటో, అర టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు.
కావలసిన పదార్థాలు
ముందుగా జామకాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వాటికీ అన్ని మసాలాలను పట్టించుకోవాలి.
స్టెప్- 1
స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఆయిల్ వేసి, దానిలో ఉల్లిపాయలు, అర టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ రంగు మారే వరకు బాగా వేయించాలి.
స్టెప్- 2
ఇప్పుడు ఈ మిశ్రమంలో కట్ చేసిన జామకాయ ముక్కలు, కొద్దిగా నీరు పోసి మెత్తబడే వరకు స్టవ్ మీదే ఉంచి బాగా ఉడికించాలి.
స్టెప్- 4
చివర్లో అన్ని మసాలా పొడులు, కొత్తిమీర వేసి స్టవ్ చేసి దించేయండి. అంతే, జామకాయ మసాలా రెడీ.