ఇలా చేస్తే మీ చెట్టు నిండా చామంతి పూలే.. మిస్ అవ్వకండి!
Samatha
19 February 2026
ఇంటి ముందు అందమైన పూల మొక్కలు ఉంటే, ఆ ఇంటికి ఉండే కలే వేరు. అందుకే చాలా మంది తమ ఇంటి ముందు అనేక రకాల పూల మొక్కలు పెట్టుకుంటారు.
అందమైన మొక్కలు
ఇక ప్రతి ఒక్కరి ఇంటిలో తప్పక ఉండే పూల మొక్కల్లో చామంతి మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే, ఇది నాటగానే, త్వరగా పెరుగుతుంది.
చామంతి మొక్క
అలాగే ఏ ఫంక్షన్స్ అయినా లేదా పూజల సమయంలో కూడా ఈ పూలను ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. అందువలన చామంతి మొక్క చాలా మంది ఇల్లల్లో ఉంటుంది.
చామంతి పూలు
అయితే మీ ఇంటి వద్ద ఉంచే చామంతి చెట్టు గుబురుగా పూలు పూయాలా? తప్పక ఈ చిట్కాలు పాటించాలంట. ముందుగా మొక్క వద్ద ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి.
గుబురుగా పూయడం
అదే విధంగా, మొక్క కొమ్మల చివర్లను తుంచుతూ ఉండటం వలన ఇది గుబురుగా పెరిగి,ఎక్కువ పూలను ఇస్తుంది. అంతే కాకుండా ఈ మొక్కకు తప్పకుండా 6 గంటల ఎండ తాకాలి.
చివర్లు కట్ చేయడం
ఆకులపై మచ్చలు, పురుగుల ఉంటే వెంటనే వాటిని కత్తిరించాలి. అలాగే మొక్క 5 అంగులాలు పెరిగిన వెంటనే కట్ చేయడం వలన కొత్త కొమ్మలు పుట్టుకొచ్చి, ఎక్కువ పూలు పూస్తుంది.
చీడ ఉన్న ఆకులను తుంచడం
అదే విధంగా, మొక్కకు పొటాషియం,ఫాస్పరస్ వంటి ఎరువులు వేయడం, ప్రతి రోజూ నీళ్లు పోస్తూ ఉండటం వలన మొక్క ఆరోగ్యంగా పెరిగి చెట్టు నిండా పూలను ఇస్తుంది.
పొటాషియం, ఫాస్పరస్
అలాగే చామంతి పూలు ఎక్కువగా పూయాలి అంటే, మొక్క చుట్టు కలుపు తీసి, ఆవు పేడలాంటి ఎరువులను వేయాలి. దీని వలన మొక్క బలంగా ఉండి, ఎక్కువ పూలనిస్తుంది.