Dry Skin Care: వర్షాకాలంలో డ్రై స్కిన్ సమస్యలు వేధిస్తున్నాయా? పరిష్కారాలు మీకోసం..
Dry Skin Care: సీజన్ సీజన్‌లో ఏవో రకమైన సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి.
Dry Skin Care: సీజన్ సీజన్‌లో ఏవో రకమైన సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. వర్షాకాలంలో డ్రై స్కిన్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. పొడి చర్మం కారణంగా దురద వస్తుంది. అసౌకర్యంగా ఉంటుంది. అలాగే చర్మం దాని సహజ ప్రకాశాన్ని కోల్పోతుంది. ఈ డ్రై స్కిన్ సమస్యలను తొలగించేందుకు హోమ్ రెమిడీస్‌ను సూచిస్తున్నారు నిపుణులు. ఈ చిట్కాలు.. పొడి చర్మం సమస్యలను తగ్గించి చర్మం మృదుత్వాన్ని కాపాడుతాయి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అరటిపండు: అరటిపండు శరీరానికి ఎంత మేలు చేస్తుందో.. చర్మ ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. అరటిపండు అనేది చర్మానికి తేమనిచ్చే సహజ పదార్ధం. అరటిపండులో విటమిన్ సి, ఎ, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఈ పదార్థాలన్నీ డ్రై స్కిన్ సమస్యను దూరం చేయడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం అరటిపండు పేస్ట్‌లో కొబ్బరి నూనెను కలిపి చర్మానికి అప్లై చేయాలి. కాసేపు అలాగే ఉంచి.. ఎండిన తరువాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది క్రమంగా చేయడం వలన పొడి చర్మం సమస్య తగ్గుతుంది.
కొబ్బరి నూనె: పొడి చర్మంపై కొబ్బరి నూనె అద్భుత ప్రభావాన్ని చూపుతుంది. టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెతో ఒక టేబుల్ స్పూన్ బేసన్ మిక్స్ చేయాలి. రెండు పదార్థాలను బాగా మిక్స్ చేసి చర్మంపై అప్లై చేయాలి. 30 నిమిషాల పాటు చర్మంపై ఉంచిన తర్వాత, గోరువెచ్చని నీటితో కడగాలి. డ్రై స్కిన్ సమస్యల నుండి బయటపడేందుకు ఈ ప్యాక్ ను రోజుకు ఒకసారి ఉపయోగించాలి.
బేసన్, పాలు: బేసన్ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చర్మం ప్రకాశాన్ని పునరుద్ధరించడంతో పాటు, చర్మం పొడిబారడాన్ని నియంత్రిస్తుంది. ఇందుకోసం కొన్ని పాలలో ఒక టీస్పూన్ బేసన్, ఒక చిటికెడు పసుపు పొడిని కలపాలి. వీటిని బాగా మిక్స్ చేయాలి. ఆ పేస్ట్‌ను చర్మంపై అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
కాఫీ: కాఫీ తాగడం వల్ల మీ మూడ్ రిఫ్రెష్ అయినట్లే, కాఫీని చర్మానికి అప్లై చేయడం వల్ల కూడా చర్మం తాజాదనాన్ని పునరుద్ధరిస్తుంది. కాఫీలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇందుకోసం ఒక టీస్పూన్ కాఫీ పౌడర్‌తో పాటు తేనె, రోజ్ వాటర్ తగిన మోతాదులో మిక్స్ చేయాలి. వాటిని బాగా కలిపి చర్మంపై అప్లై చేయాలి. ఈ ప్యాక్.. డ్రై స్కిన్ సమస్యలను దూరం చేస్తుంది.