Skin Care: చర్మాన్ని మరింత అందంగా మార్చుకోవాలంటే రాత్రి సమయంలో ఈ చిట్కాలను పాటించండి..

|

Nov 07, 2022 | 7:32 AM

చర్మం కాంతివంతంగా, అందంగా ఉండాలంటే చర్మాన్ని సంరక్షించడం చాలా అవసరం. చాలా మంది చర్మ సంరక్షణ కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ వాడతారు.

Skin Care: చర్మాన్ని మరింత అందంగా మార్చుకోవాలంటే రాత్రి సమయంలో ఈ చిట్కాలను పాటించండి..
Skin Care
Follow us on

చర్మం కాంతివంతంగా, అందంగా ఉండాలంటే చర్మాన్ని సంరక్షించడం చాలా అవసరం. చాలా మంది చర్మ సంరక్షణ కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ వాడతారు. ఇది చర్మాన్ని మరింత దెబ్బతీస్తుంది. మార్కెట్‌లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కెమికల్స్ అధిక శాతంలో ఉంటాయి. ఒక్కోసారి మనం కోరుకున్న ఫలితం లభించదు. అయితే ముఖం కాంతివంతంగా ఉండేందుకు ఇంట్లోనే ఇలాంటి అనేక చర్యలు తీసుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రిపూట మేకప్ చేయకూడదు..

మహిళలు నిద్రపోయే ముందు ముఖం కడుక్కున్న తర్వాత బ్యూటీ ప్రొడక్ట్స్‌ను తరచుగా ఉపయోగిస్తారు. రాత్రి వేళ ముఖానికి రెస్ట్ ఇస్తే బాగుంటుంది. రాత్రి పడుకునేటప్పుడు ఎలాంటి ప్రోడక్ట్స్ వాడొద్దు. నిద్రలో చర్మ రంద్రాలు తెరుచుకుంటాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం ద్వారా ఈ చర్మ రంద్రాలు మూసుకుపోతాయి. దీంతో చర్మంలో సమస్యలు తలెత్తుతాయి.

స్కిన్ టోనర్ ఉపయోగించాలి..

ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి టోనర్‌ని ఉపయోగించాలి. టోనర్‌ను అప్లై చేసేటప్పుడు, కాటన్ ప్యాడ్‌ని ఉపయోగించడం ఉత్తమం. దీన్ని మీ ముఖం, మెడపై అప్లై చేయాలి. ఇది చర్మం సహజ ph స్థాయిని సరిచేస్తుంది. బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

హ్యాండ్ క్రీమ్..

ముఖంలాగే చేతులకు కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అందమైన చేతుల కోసం హ్యాండ్ క్రీమ్ ఉపయోగించొచ్చు. ఇందుకోసం ముందుగా గోరువెచ్చని నీరు, సబ్బుతో చేతులను బాగా కడగాలి. ఆ తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడుచుకోవాలి. ఆ తరువాత హ్యాండ్ క్రీమ్ అప్లై చేయాలి.

జుట్టును జాగ్రత్తగా చూసుకోవాలి..

రాత్రి పడుకునేటప్పుడు జుట్టు విరబోయొద్దు. సాధారణంగా మహిళలు నిద్రిస్తున్నప్పుడు జుట్టును విరబోస్తారు. ముఖానికి జుట్టుకి అప్లై చేసిన నూనె, ధూళి అంటుకుంటుంది. దీని కారణంగా ముఖంపై మొటిమలు వస్తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..