Beautycare Tips: మెరిసే స్కిన్ మీ సొంతం కావాలా.. ఈ ఆయుర్వేద స్క్రబ్ ని ట్రై చేయండి..
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వ్యాయామంతో పాటు ఉబ్తాన్ (స్క్రబ్) ను ఉపయోగించవచ్చు. దీనిని భారతీయులు శతాబ్దాలుగా చర్మ సంరక్షణ కోసం సాంప్రదాయకంగా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మానికి చాలా మంచిది. ఉబ్తాన్ అంటే భారతదేశంలో సాంప్రదాయకంగా ఉపయోగించే సహజ చర్మ సంరక్షణ ఉత్పత్తి. సాధారణంగా శనగ పిండి, పాలు, పసుపు , ఇతర మూలికల వంటి సహజ పదార్థాల మిశ్రమంతో తయారు చేయబడుతుంది. కనుక దుష్ప్రభావాలు ఉండవు. ఈ రోజు ఉబ్తాన్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం

మన ముఖం కాంతివంతంగా ఉండడానికి వివిధ పద్ధతులను ప్రయత్నిస్తారు. రసాయనాలతో తయారయ్యే క్రీములు మీరు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. పైగా చర్మానికి కూడా మంచివి కావు. అయితే ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన స్క్రబ్‌లను చర్మ కాంతిని పెంచడానికి ఉపయోగించవచ్చు. వాటిలో ఒకటి ఉబ్తాన్ (స్క్రబ్) . దీనిని ఉపయోగించవచ్చు. దీనిని భారతీయులు శతాబ్దాలుగా చర్మ సంరక్షణ కోసం సాంప్రదాయకంగా ఉపయోగిస్తున్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే అవి వివిధ మూలికలు, సుగంధ ద్రవ్యాలు, సహజ ఉత్పత్తుల మిశ్రమంతో తయారు చేస్తారు. కనుక దీన్ని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? చర్మ కాంతిని పెంచడానికి ఇది ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.
- ప్రకాశవంతమైన చర్మాన్ని కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం మార్కెట్ లో దొరికే వివిధ క్రీములను ఉపయోగిస్తారు. అవి చర్మానికి ఇబ్బందులు కలిగించవచ్చు. కనుక ఈ క్రీమ్ లకు బదులుగా ఉబ్టాన్‌ను ఉపయోగించవచ్చు. ఎలాంటి రసాయనాలను ఉపయోగించకుండా మెరిసే చర్మాన్ని పొందడానికి ఇది ఒక గొప్ప పరిష్కారం.
- ఉబ్టాన్ ఒక ఎక్స్‌ఫోలియెంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మం పై పొరను శుభ్రపరుస్తుంది. చనిపోయిన చర్మ కణాలు, మలినాలను తొలగించి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.
- ఈ ఉబ్తాన్ చర్మానికి మెరుపును ఇస్తుంది. దీనిలోని పసుపు, కుంకుమపువ్వు, శనగపిండి వంటి సహజ పదార్థాలు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి.
- ఉబ్టాన్ చర్మ రంధ్రాల నుంచి మురికి, అదనపు నూనె , ఇతర కాలుష్య కారకాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మొటిమలు , ఇతర చర్మ సమస్యలను నివారించడానికి కూడా సహాయపడుతుంది.
- ఉబ్టాన్ లోని పాలు, పెరుగు లేదా తేనె వంటి సహజ పదార్థాలు చర్మానికి లోతైన తేమను అందించడంలో సహాయపడతాయి.
- ఉబ్టాన్ లోని మూలికా పదార్థాలు చర్మాన్ని బిగుతుగా మార్చడానికి సహాయపడతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)







