AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఆయుర్వేదం అద్భుతాలు.. ఇలా చేస్తే.. షుగర్ లెవల్స్ దెబ్బకు దిగిరావాల్సిందే..

షుగర్ వ్యాధి అందరినీ పట్టిపీడిస్తుంది. ఇది చాలా సింపుల్‌గా కనిపించినప్పటికీ అనుభవించేవారికి దాన్ని బాధ తెలుస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే షుగర్ కంట్రోల్‌కు ఆయుర్వేదం పలు అద్భుత పరిష్కారాలను చూపిస్తుంది. అవి పాటిస్తే దెబ్బకు మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Health Tips: ఆయుర్వేదం అద్భుతాలు.. ఇలా చేస్తే.. షుగర్ లెవల్స్ దెబ్బకు దిగిరావాల్సిందే..
Ayurvedic Remedies for Diabetes
Krishna S
|

Updated on: Sep 14, 2025 | 3:39 PM

Share

ఆయుర్వేదం కేవలం వ్యాధులను నయం చేయడమే కాదు ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎలా అనుసరించాలో కూడా బోధిస్తుంది. ఈ మధ్యకాలంలో అందరినీ వేధిస్తున్న భూతం డయాబెటిస్. ఏజ్‌తో సంబంధం లేకుండా చాలా మంది షుగర్‌తో బాధపడుతున్నారు. దీన్ని నియంత్రణకు ఆహారం, ఔషధం, జీవనశైలి అనే మూడు ముఖ్యమైన అంశాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఆహారం

మధుమేహంతో బాధపడేవారికి ఆహారం చాలా ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారం.. నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

తృణ, చిరుధాన్యాలు: బార్లీ, గోధుమ, పాత బియ్యం, సజ్జలు, జొన్నలు వంటివి ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ముఖ్యంగా బార్లీ, బరువును తగ్గించడంతో పాటు రక్తంలో షుగర్ స్థాయిలు పెరగకుండా చూస్తుంది.

చేదు, వగరు రుచులు: కాకరకాయ, వేప, తులసి, ఉసిరి, మెంతి వంటి చేదు, వగరు రుచులున్న పదార్థాలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయి.

పండ్లు: నేరేడు, బొప్పాయి వంటి పండ్లు కూడా షుగర్ లెవెల్స్ నియంత్రణలో సహాయపడతాయి. నేరేడు పండ్లలోని కొన్ని పదార్థాలు స్టార్చ్‌ను చక్కెరగా మారకుండా నిరోధిస్తాయి.

మెడిసిన్స్

మధుమేహ నియంత్రణకు ఆయుర్వేదంలో ఎన్నో సహజసిద్ధమైన మూలికలు ఉన్నాయి.

ఔషధ మూలికలు: మెంతులు, వేప, పసుపు, ఉసిరి, దాల్చిన చెక్క వంటివి రక్తంలో షుగర్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ మూలికలు శరీరాన్ని బలోపేతం చేస్తాయి.

జీవనశైలి

ఆహారంతో పాటు, సరైన జీవనశైలిని పాటించడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

వ్యాయామం: రోజూ కనీసం 30 నిమిషాలు యోగా, నడక, ఈత వంటి వ్యాయామాలు చేయడం వల్ల ఇన్సులిన్ పనితీరు మెరుగుపడుతుంది.

నిద్ర: రోజుకు 7-8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవడం చాలా అవసరం. తక్కువ నిద్ర వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగి షుగర్ లెవెల్స్ అధికమవుతాయి.

ఒత్తిడి నియంత్రణ: ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం.

ఏం తినకూడదు?

కొవ్వు పదార్థాలు, వేయించినవి, చల్లటి ఆహారాలు, పాలు, పాల ఉత్పత్తులు, తీపి పదార్థాలు, బంగాళదుంపలు, మైదా ఉత్పత్తులు వంటివి తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడూ తాజాగా, వేడిగా వండిన ఆహారాన్ని తినడం జీర్ణక్రియకు మంచిది.

ఆయుర్వేదం సూచించిన ఈ మూడు సూత్రాలను పాటిస్తే, మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ఈ పద్ధతులను అనుసరించి ఆరోగ్యంగా ఉండవచ్చు.

(NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్