Beauty Tips: ఐబ్రోస్ చాలా సన్నగా ఉన్నాయా.. వీటితో ఒత్తుగా మార్చేయండి!

|

Feb 26, 2024 | 3:21 PM

చాలా మందికి ఐబ్రోస్ అనేవి చాలా సన్నగా ఉంటాయి. నల్లగా, ఒత్తుగా కనిపించాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. ఐబ్రోస్ ఒత్తుగా ఉంటే.. అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. మీ ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేసే వాటిల్లో ఐబ్రోస్ కూడా ఒకటి. కేవలం ఆడవారికే కాదు మగవాళ్లకు కూడా ఇలాగే అనిపిస్తుంది. దీంతో మార్కెట్లో లభ్యమయ్యే ప్రోడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. మరి కొంత మంది ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు. ఇలాంటివి కొంత మందికి..

Beauty Tips: ఐబ్రోస్ చాలా సన్నగా ఉన్నాయా.. వీటితో ఒత్తుగా మార్చేయండి!
Beauty Tips
Follow us on

చాలా మందికి ఐబ్రోస్ అనేవి చాలా సన్నగా ఉంటాయి. నల్లగా, ఒత్తుగా కనిపించాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. ఐబ్రోస్ ఒత్తుగా ఉంటే.. అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. మీ ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేసే వాటిల్లో ఐబ్రోస్ కూడా ఒకటి. కేవలం ఆడవారికే కాదు మగవాళ్లకు కూడా ఇలాగే అనిపిస్తుంది. దీంతో మార్కెట్లో లభ్యమయ్యే ప్రోడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. మరి కొంత మంది ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు. ఇలాంటివి కొంత మందికి అస్సలు పడవు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇంట్లో ఉండే వాటితోనే.. నేచురల్‌గా ఐబ్రోస్‌ని నల్లగా, ఒత్తుగా మార్చుకోవచ్చు. మరి కనుబొమ్మల్ని ఎలా ఒత్తుగా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం ఆయిల్:

బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల అందానికి బాదం బాగా సహాయ పడుతుంది. అదే విధంగా బాదం ఆయిల్‌తో కూడా చర్మం, జుట్టును ఆరోగ్యంగా చూసుకోవచ్చు. అలాగే కనుబొమ్మల్ని పెంచడంలో కూడా బాదం ఆయిల్ చక్కగా హెల్ప్ చేస్తుంది. ప్రతి రోజూ మీరు పడుకునే ముందు బాదం ఆయిల్‌ను ఐబ్రోస్‌ మీద రాస్తూ ఉంటే.. కొద్ది రోజుల్లోనే మీకు మార్పు కనిపిస్తుంది.

కొబ్బరి నూనె:

అందాన్ని రెట్టింపు చేయడంలో కొబ్బరి నూనె కూడా బాగా సహాయ పడుతుంది. చర్మాన్ని తేమగా, సాఫ్ట్‌గా, హైడ్రేట్‌గా చేస్తుంది. అదే విధంగా జుట్టు బలంగా, దృఢంగా చేయడంలో కొబ్బరినూనె చక్కగా పని చేస్తుంది. ఐబ్రోస్ ఒత్తుగా, నల్లగా ఉండాలి అనుకునే వారు. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఐబ్రోస్‌పై కొబ్బరి నూనెను రాస్తూ ఉండండి. ఇలా చేస్తే తక్కువ రోజుల్లోనే మీకు మార్పు అనేది కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆముదం:

పూర్వం ఎక్కువగా జుట్టుకు ఆముదాన్నే రాసేవారు. జుట్టును పెంచడంలో ఆముదం ముఖ్య పాత్ర వహిస్తుంది. అందుకే అప్పట్లో అందరి జుట్టు పొడుగ్గా, బలంగా, ఒత్తుగా ఉండేది. రాను రాను ఆముదం వాడకం తగ్గిపోయింది. చాలా మంది దీన్ని అస్సలు వాడటం లేదు. మీ ఐబ్రోస్ ఒత్తుగా, నల్లగా ఉండాలంటే.. ప్రతి రోజూ ఆముదాన్ని రాయండి. ఇలా రాయడం వల్ల.. మంచి మార్పు ఉంటుంది.

ఐబ్రోస్ చేయించుకుంటూ ఉండాలి:

ఐబ్రోస్ ఒత్తుగా, నల్లగా పెరగాలి అనుకునేవారు ఎక్కువగా ఐబ్రోస్‌ చేయించుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఐబ్రోస్ మంచి షేప్ రావడమే కాకుండా.. ఒత్తుగా.. ఆకర్షణీయంగా కనిపిస్తాయి.