
సాధారణంగా వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అందులోనూ ఉదయం వాకింగ్ చేస్తే.. వెయిట్ లాస్ అవ్వడంతో పాటు అనేక ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి. వాకింగ్ చేయడంలో విభిన్న మార్గాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో గ్రౌండింగ్ లేదా ఎర్తింగ్ కూడా ఒకటి. చెప్పులు లేకుండా పచ్చ గడ్డి మీద నడవడమే గ్రౌండింగ్. మరి చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద నడవడం ఆరోగ్యానికి మంచిదేనా? అసలు చెప్పులు లేకుండా గడ్డి మీద నడవడం నిజంగానే ఆరోగ్యానికి మంచిదా? దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి? మరి పచ్చ గడ్డి మీద నడవడంపై వైద్య శాస్త్రం ఏం చెబుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చగడ్డిపై చెప్పులు లేకుండా నడవడాన్ని గ్రౌండింగ్ అని అంటారు. ఇలా భూమిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. భూమికి, శరీరానికి మధ్య కనెక్షన్‌ని ఏర్పాటు చేస్తుంది. ఇందులో భూమి నుండి శరీరానికి ఎలక్ట్రాన్‌లను బదిలీ చేస్తుంది. కాళ్లలో వచ్చే మంటను, నిద్ర నాణ్యతను మెరుగు పరుస్తుంది.
పచ్చ గడ్డిపై నడవడం వల్ల మనస్సు, శరీరంపై పడే ఒత్తిడి తగ్గుతుంది. ఇది ప్రశాంతతను చేకూరుస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. భూమి మీద నడిచినప్పుడు పాదాల గుండా వైబ్రేషన్.. శరీరంలోకి ప్రవేశిస్తుంది.
కాళ్లు చెప్పులు లేకుండా పచ్చ గడ్డిపై నడవడం వల్ల పాదాలకు ఎనలేని శక్తి లభిస్తుంది. ఇది పాదాలకు సంబంధించిన సమస్యలు, నొప్పులు, వాపును తగ్గించడంలో సహాయ పడుతుంది.
పచ్చ గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మట్టిలో ఉండే సూక్ష్మ జీవుల ప్రభావం కారణంగా ఇమ్యూనిటీ బల పడుతుంది. దీంతో రోగాలు, అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది. అంతే కాకుండా గట్ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి.. మానసిక స్థితి కూడా చురుగ్గా ఉంటుంది.
పచ్చ గడ్డిపై చెప్పులు లేకుండా నడవటం వల్ల.. శరీరంలో రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. శరీర భాగాలకు కూడా రక్త ప్రసరణ జరుగుతుంది. దీంతో అన్ని భాగాలూ చక్కగా పని చేస్తాయి. చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగు పడుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..