Afternoon Bath Affect: మీరు మధ్యాహ్నసమయంలో స్నానం చేస్తున్నారా..మీరు కష్టాలను కోరి తెచ్చుకున్నట్టే!
స్నానం చేయడం అనేది శరీరాన్ని శుభ్రపరుచుకోవడం కోసమే కాదు. దైనందిన కార్యక్రమాలను ఉల్లాసంగా ప్రారంభించడానికి ఒక సాధనం కూడా అంటారు ఆధ్యాత్మికవేత్తలు.
Afternoon Bath Affect: స్నానం చేయడం అనేది శరీరాన్ని శుభ్రపరుచుకోవడం కోసమే కాదు. దైనందిన కార్యక్రమాలను ఉల్లాసంగా ప్రారంభించడానికి ఒక సాధనం కూడా అంటారు ఆధ్యాత్మికవేత్తలు. స్నానం చేయడం కోసం కొన్ని ప్రత్యేక నియమాలను మన పెద్దలు సూచించారు. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవి ఆచరించడం కష్టతరమైన పనే. కానీ.. స్నానం ఎప్పుడు చేయాలి అనే విషయంలో ఆధ్యాత్మిక వేత్తలు.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్న సూచనలు ఆచరించదగినవే. వీలైనంత వరకూ ఆ విధంగా చేయడం ద్వారా అనేక సమస్యలను దరి చేయనీయకుండా చేయవచ్చు. మరి స్నానం ఏ సమయంలో చేయాలి? మధ్యాహ్నం స్నానం చేయడం వలన కలిగే కష్టాలేమిటి తెలుసుకుందాం.
ఆయుర్వేదం ప్రకారం, ఉదయం సూర్యోదయానికి ముందు, సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయాలి. శాస్త్రం సూచించిన పద్ధతిలో చేసే స్నానం మనస్సు ను అలాగే శరీరాన్ని ఒకే విధంగా ఉత్తేజపరుస్తుంది. కొంతమంది గృహిణులు అలాగే ఇంటివద్ద నుంచి పనిచేయడం అలవాటు అయినా వారు పని తర్వాత భోజనానికి ముందు స్నానం చేస్తారు. ఇది దుఃఖకరకం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యరీత్యా ఈవిధంగా చేయడం మంచిది కాదు అని వారంటున్నారు.
ధర్మశాస్త్రం ప్రకారం, ఉదయం స్నానం చేయడానికి నాలుగు యమలు ఉన్నాయి. ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య స్నానం చేసే సమయాలకు ప్రత్యేకమైన విశేషణాలు చెబుతుంది ఆధ్యాత్మిక కోణం. ప్రతి ఒక్కరికీ అనువైన సమయం ఉదయం 5 నుంచి 7 గంటల మధ్య స్నానం. ఈ సమయంలో స్నానం మంచి అదృష్టం, ఐక్యత, ఆనందాన్ని కలిగిస్తుందని ధర్మం చెబుతుంది. ఈ సమయంలో విద్యార్థులు స్నానం ఎంచుకోవడం వల్ల ఏకాగ్రత మరియు చురుకుదనం పెరగడానికి సహాయపడుతుందని అంటారు. ఈ సమయంలో స్నానం చేయడం శుభప్రదం అని కూడా నమ్ముతారు.
ధర్మ శాస్త్రం ప్రకారం, ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేయడం వలన దుఃఖం కలుగుతుంది. ఉదయం 8 కి ముందు స్నానం చేయలేకపోతే, సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయాలి. ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేయడం వల్ల బాధ, నష్టం అలాగే, పేదరికం కలుగుతుందని నమ్ముతారు. అందుకే ప్రాచీనులు సూర్యోదయానికి ముందు స్నానం చేసి శరీరాన్ని శుద్ధి చేసి, ఆ తర్వాత కర్మలను ప్రారంభించేవారు.