AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Sleep Day: ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోతున్నారా.. అయితే మీ బాడీ ఇక షెడ్డుకే, లేటెస్ట్ సర్వేలో షాకింగ్ నిజాలు

నిద్ర లేమి చాలా మందికి జీవితంలో ఒక భాగమైపోయింది. డిజిటల్ క్రియేటర్స్ అవార్డ్‌లో ఇటీవల జరిగిన ఇంటరాక్షన్ సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా మనిషి నిద్ర ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. చాలామంది తమ నిద్ర దినచర్యకు సంబంధించి క్రమశిక్షణతో లేరని నొక్కి చెప్పాడు. తాజా సర్వేలో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి.

World Sleep Day: ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోతున్నారా.. అయితే మీ బాడీ ఇక షెడ్డుకే, లేటెస్ట్ సర్వేలో షాకింగ్ నిజాలు
Sleepless
Balu Jajala
|

Updated on: Mar 15, 2024 | 12:04 PM

Share

నిద్ర లేమి చాలా మందికి జీవితంలో ఒక భాగమైపోయింది. డిజిటల్ క్రియేటర్స్ అవార్డ్‌లో ఇటీవల జరిగిన ఇంటరాక్షన్ సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా మనిషి నిద్ర ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. చాలామంది తమ నిద్ర దినచర్యకు సంబంధించి క్రమశిక్షణతో లేరని నొక్కి చెప్పాడు. ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా లోకల్ సర్కిల్స్ నిర్వహించిన తాజా సర్వేలో గత రెండేళ్లలో, రోజుకు 7 గంటలు కూడా నిరంతరాయంగా నిద్రపోవడంలో అనేక మంది పౌరులు సమస్యలు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.

సర్వే ప్రకారం, 61 శాతం మంది భారతీయులు గత 12 నెలల్లో రాత్రిపూట 6 గంటల కంటే తక్కువ నిరంతరాయంగా నిద్రపోగా, 38 శాతం మంది  రాత్రిపూట 4 నుండి 6 గంటల నిరంతరాయ నిద్రను పొందుతున్నారు. వారిలో దాదాపు 23 శాతం మంది పౌరులు 4 గంటల వరకు నిద్రపోవడం లేదట. అయితే 50 శాతం మంది ప్రజలు రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారట. సర్వేలో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఇంతకు ముందు నిర్వహించిన సర్వేలతో పోల్చినప్పుడు, ప్రతిరోజూ 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే భారతీయ పౌరుల శాతం 2022లో 50 శాతం నుండి 2023లో 55 శాతానికి పెరిగింది. 2024లో నిద్ర లేమి ఫిర్యాదులతో ప్రతివాదులు 61 శాతానికి నిరంతరంగా పెరుగుతున్నారని సర్వే పేర్కొంది.

72 శాతం మంది ప్రతివాదులు నిద్రలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు వాష్‌రూమ్‌ని ఉపయోగించడం కోసం మేల్కొంటారని చెప్పారు. అంతరాయం లేని నిద్ర వెనుక మానసిక ఆరోగ్య సమస్యల నుండి శారీరక ఆరోగ్య సమస్యల వరకు ఉండవచ్చు.ఇక దాదాపు 72 శాతం మంది తమ నిద్రలో ఒకసారి లేదా అంతకంటే ఎక్కువ సార్లు వాష్‌రూమ్‌ని ఉపయోగించారు. సర్వేలో దాదాపు 43 శాతం మంది వ్యక్తులు నిద్రపోవడానికి చాలా సమయం తీసుకుంటున్నారని, ఇక ఉదయాన్నే ఇంటి కార్యకలాపాలకు దూరంగా ఉంటారని చెప్పారు. COVID-19 మహమ్మారి సమయంలో వారి నిద్ర నాణ్యత క్షీణించిందని సర్వేలో పాల్గొన్న 26 శాతం మంది వ్యక్తులు గుర్తించారు. యోగ, ధ్యానం నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మంచి నిద్ర కోసం కొన్ని చిట్కాలు

రోజూ నడవడం, గంటపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది

ఆరోగ్యంగా తినండి లేదా తేలికపాటి రాత్రి భోజనం చేయండి

రాత్రి భోజనం, నిద్రవేళ మధ్య 3 గంటల గ్యాప్ ఉంచండి

నిద్రకు 3 గంటల ముందు టీ లేదా కాఫీకి దూరంగా ఉండండి

మంచి నిద్ర కోసం మీరు పుస్తకాన్ని చదవవచ్చు. ధ్యానం చేయవచ్చు