మనలో చాలా మంది తరచూ అనారోగ్యానికి గురవుతారు. మన అనారోగ్యం వల్ల ఉద్యోగ జీవితంలో ఇతరులు కష్టపడుతుంటారు. అలాగే తరచూ సెలవులు తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. కానీ తప్పని పరిస్థితి.. కొద్దిపాటి పనికే వెంటనే అలసటకు గురవుతుంటాం. అయితే ఎంత మంది డాక్టర్లను సంప్రదించిన సమస్యకు పరిష్కారం దొరకడం లేదని బాధపడుతుంటాం. కచ్చితంగా ఇలాంటి వారి కోసమే నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆహార అలవాట్లు, జీవనశైలి కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొంటున్నారు. కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుందని చెబుతున్నారు.
చాలా మంది పని ఒత్తిడితో భోజనాన్ని స్కిప్ చేసేస్తుంటారు. అదే పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది. భోజనం చేస్తేనే శరీరానికి అవసరమయ్యే శక్తి అందుతుందని తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తారు. నిపుణుల సూచనల ప్రకారం మూడు పూటలా సమతుల్య భోజనం కచ్చితంగా చేయాలి. అలాగే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటివి ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తపోటు తగ్గి గుండె జబ్బుల నుంచి రక్షణ దొరుకుతుంది. ఆహారంలో కాల్షియం స్థాయిని నిర్వహించడం వల్ల ఎముకలకు బలం వస్తుంది. బ్రోకోలి, ఆకు కూరలు వంటి ఆహారాలను తీసుకుంటే శరీరానికి అవసరమయ్యే కాల్షియం అందుతుంది.
నడక అనేది శరీరంలో ప్రతి కండరాన్ని కదిలించే గొప్ప వ్యాయామం. జీవన శైలిలో మార్పు కోసం కచ్చితంగా ప్రతిరోజూ 30 నిమిషాలు నడవాలి. ఇలా చేస్తే శరీరంలో కొలెస్ట్రాల్ తగుతుంది. అలాగే రక్తపోటును నార్మల్ గా ఉంచుతుంది. ఎముకలకు అధిక శక్తిని ఇస్తుంది. కాబట్టి తరచూ అనారోగ్యానికి గురయ్యే వారు ప్రతిరోజూ నడక వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి కచ్చితంగా అధికంగా నీరు తాగాలి. ఇలా చేస్తే శరీర ఉష్టోగ్రత నార్మల్ గా ఉంటుంది. అలాగే కీళ్లను బాగా లూబ్రికెంట్ చేస్తుంది. కాబట్టి ప్రతి రోజూ కచ్చితంగా 4 లీటర్లకు తగ్గకుండా నీటిని తాగాలి.
తరచూ అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే కచ్చితంగా ఒత్తిడి స్థాయిని నియంత్రించుకోవాలి. ఎక్కువ షిఫ్టులు, మానసిక సమ్యలు, అధిక పని భారం వల్ల ఒత్తిడి స్థాయి పెరుగుతుంది. కాబట్టి డిప్రెషన్ కు గురయ్యే అవకాశం ఉంది. సో ఒత్తిడి ప్రధాన కారణమైన పని ఒత్తిడి నుంచి బయటపడాలి. తద్వారా అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.
సాధారణంగా ఓ సామాన్య మానవుడికి రోజూ 8 గంటల నిద్ర ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ చాలా మంది నిద్ర విషయంలోనే నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. నిపుణులు మాత్రం నిద్ర విషయంలో అస్సలు రాజీ పడకూడదని సూచిస్తున్నారు. సరైన షెడ్యూల్ తో సమయానుగుణంగా నిద్రకు ఉపక్రమించాలి. అలాగే పడుకునే ముందు కేవలం లైట్ ఫుడ్ ను మాత్రమే తీసుకోవాలి. సరైన నిద్ర ఉంటే గుండె జబ్బులు, ఊబకాయం, డిప్రెషన్ సమస్య నుంచి బయటపడవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..