AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజంతా ఏసీలోనే కూర్చుని ఉంటున్నారా..? అయితే, మీ ఆరోగ్యం పెద్ద ఆపదలో ఉన్నట్టే..!

రోజుకు 4-5 గంటలు ఏసీలో కూర్చోవడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయని అంటున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం, AC కూలింగ్‌లో ఎక్కువసేపు ఉండే వ్యక్తులు, సగటు వ్యక్తుల కంటే జీవక్రియ రేటు తక్కువగా ఉంటుందని గుర్తించారు. దీనివల్ల బరువు వేగంగా పెరుగుతున్నారని చెబుతున్నారు.. ఏసీ గదుల్లో ఎక్కువ టైమ్ ఉంటే ఎన్ని అనర్థాలో తెలియాలంటే..

రోజంతా ఏసీలోనే కూర్చుని ఉంటున్నారా..? అయితే, మీ ఆరోగ్యం పెద్ద ఆపదలో ఉన్నట్టే..!
Ac For Whole Day
Jyothi Gadda
|

Updated on: Apr 29, 2025 | 9:19 AM

Share

వేసవి వచ్చిందంటే ఏసీ పక్కాగా ఉండాలి. ఎండకి తట్టుకోలేక రోజంతా ఏసీలోనే కూర్చంటారు కొందరు. అయితే అలా చేస్తే మీరు పెద్ద ఆపదలో ఉన్నట్టే అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. నిరంతరం ACలో కూర్చోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. రోజుకు 4-5 గంటలు ఏసీలో కూర్చోవడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయని అంటున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం, AC కూలింగ్‌లో ఎక్కువసేపు ఉండే వ్యక్తులు, సగటు వ్యక్తుల కంటే జీవక్రియ రేటు తక్కువగా ఉంటుందని గుర్తించారు. దీనివల్ల బరువు వేగంగా పెరుగుతున్నారని చెబుతున్నారు.. ఏసీ గదుల్లో ఎక్కువ టైమ్ ఉంటే ఎన్ని అనర్థాలో తెలియాలంటే..

ఏసీలో ఎక్కువ సమయం కూర్చుని ఉండటం వల్ల ఊబకాయం పెరిగే వేగాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది ఊబకాయం, డయాబెటిస్, హృదయ సంబంధిత సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలను పెంచుతుందని చెబుతున్నారు. ఏసీ ఉష్ణోగ్రత ఎముకలు, ఊపిరితిత్తులకు హాని కలిగించడమే కాకుండా నిశ్చల జీవనశైలికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏసీలో ఎక్కువ సమయం గడిపితే శారీరక శ్రమ దాదాపు తగ్గిపోతుంది. ఏసీ కారణంగా ఒకే గదిలో కూర్చోవాల్సి వస్తుంది. దీనివల్ల బరువు పెరిగే ప్రమాదం పెరుగుతుంది.

ఏసీ గదుల్లో ఎక్కువ టైమ్‌ ఉండటం వలన శరీరంలోని కండరాల పనితీరు తగ్గుతుంది. నరాలలో రక్త ప్రసరణ మందగిస్తుంది. కాబట్టి నరాలు బలహీనంగా మారుతాయి. కొందరిలో తల తిప్పడం, వాంతులు కూడా అవుతుంటాయి. చాలా మందిలో తలనొప్పి కూడా మొదలవుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..