Monsoon: జలుబు, దగ్గుతో రోజంతా నీరసంగా అనిపిస్తుందా.. ? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి

రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే సీజనల్ వ్యాధులు వెంటనే దాడి చేస్తాయి. వాతావరణం మారిన ప్రతిసారి దగ్గు, జలుబు, జ్వరం వంటివి సతమతం చేస్తాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే..

Monsoon: జలుబు, దగ్గుతో రోజంతా నీరసంగా అనిపిస్తుందా.. ? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి
Monsoon Health
Follow us

|

Updated on: Oct 16, 2024 | 9:02 PM

గత కొన్ని రోజులుగా వరుసగా వర్షాలు పడుతున్నాయి. అటువంటి పరిస్థితిలో వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో చాలా మంది గొంతు నొప్పి, తేలికపాటి దగ్గు, అలసట, శరీర నొప్పులతో బాధపడుతున్నారు. కొంతమందికి తేలికపాటి జ్వరం, తీవ్రమైన దగ్గు కూడా కనిపిస్తుంది. అయితే దీనికి కారణం ఏమిటి? మారుతున్న వాతావరణం వల్ల ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తోంది? దీని గురించి నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.. మారుతున్న వాతావరణంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీని గురించి అస్సలు అజాగ్రత్తగా ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మారుతున్న వాతావరణంతో ఈ సమస్యలన్నీ సర్వసాధారణం. ఉదయం తీవ్రమైన వేడి ఉంటే, సాయంత్రం నాటికి మేఘాలు కమ్ముకుని వర్షం పడుతుంది. దీంతో చలి అనుభూతి కలుగుతుంది. ఇలా ఉష్ణోగ్రతలో వేగవంతమైన మార్పు శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

ఆర్‌ఎంఎల్‌ హాస్పిటల్‌ మెడిసిన్‌ విభాగం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుభాష్‌ గిరి మాట్లాడుతూ.. ఉష్ణోగ్రతలు వేగంగా మారే సమయంలో వ్యాధి నిరోధక బలహీనంగా ఉన్నవాళ్లు ఈ వాతావరణ మార్పును తట్టుకోలేరని చెప్పారు. రోగనిరోధక శక్తి బలహీనంగా మారితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పి వంటి సమస్యలు దాడి చేస్తాయి. దీంతో పాటు కొందరిలో దగ్గు పెరిగి, గొంతు సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలన్నీ దీపావళి వరకు ప్రజలను ఇబ్బంది పెడతాయి. అందువల్ల, ఈ సమయంలో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ రోగనిరోధక శక్తిని ఆరోగ్యంగా ఉంచుకుంటే తద్వారా మారుతున్న వాతావరణం మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేయదు.

ఇవి కూడా చదవండి

ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి

  • మారుతున్న వాతావరణంలో మిమ్మల్ని మీరు ఆరోగ్యాంగా ఉంచుకోవడానికి, మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం చాలా ముఖ్యం. దీని కోసం విటమిన్ సి ఉన్న పండ్లను అధికంగా తినాలి.
  • పచ్చి కూరగాయలు, పండ్లు, గింజలు, గుడ్లు, పాలు మొదలైన వాటిని తీసుకోవాలి.
  • మారుతున్న వాతావరణంలో బయట ఆహారం తినడం మానుకోవాలి. శుభ్రమైన ప్రదేశంలో వండి ఆహారం మాత్రమే తినాలి.
  • వాతావరణానికి అనుగుణంగా దుస్తులు ధరించాలి. చలిని నివారించడానికి ఫుల్ స్లీవ్ దుస్తులను ధరించాలి.
  • ఉదయం, సాయంత్రం చలి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి శాలువలు, జాకెట్లు ధరించాలి.
  • వీలైనంత ఎక్కువ వేడి ఆహార పదార్థాలు తినాలి. గ్రీన్ టీ ఈ కాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
  • చల్లటి పదార్థాలు తినడం మానేయాలి. అన్నం, పెరుగు, అరటిపండు మొదలైనవి తినాలనుకుంటే పగటిపూట తినాలి. రాత్రిపూట వీటిని తినడం మానుకోవాలి.
  • బాగా అలసిపోయినట్లు అనిపిస్తే మీ శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వండి.
  • అనవసరంగా మందులు తీసుకోవడం అలవాటు మానుకోవాలి. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్‌ని సంప్రదించిన తర్వాతే మందులు తీసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

కిచ్చా సుదీప్ బిగ్ బాస్‌‌‌కు ఎందుకు గుడ్ బై చెప్పాడు ??
కిచ్చా సుదీప్ బిగ్ బాస్‌‌‌కు ఎందుకు గుడ్ బై చెప్పాడు ??
తస్మాత్‌ జాగ్రత్త.. స్టార్ సింగర్ పేరుతో మోసం
తస్మాత్‌ జాగ్రత్త.. స్టార్ సింగర్ పేరుతో మోసం
చెన్నైలో కుండపోత వర్షాలు.. వరదనీటిలో ఇంజనీరింగ్ కాలేజీ
చెన్నైలో కుండపోత వర్షాలు.. వరదనీటిలో ఇంజనీరింగ్ కాలేజీ
ఏంటి.. ఈ అమ్మాయి మూవీలో అంత పద్దతిగా.. నెట్టింట గ్లామర్ షో.!
ఏంటి.. ఈ అమ్మాయి మూవీలో అంత పద్దతిగా.. నెట్టింట గ్లామర్ షో.!
జానీ మాస్టర్ అకౌంట్ నుంచే సంచలన పోస్ట్ పెట్టిన అయేషా.!
జానీ మాస్టర్ అకౌంట్ నుంచే సంచలన పోస్ట్ పెట్టిన అయేషా.!
నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!
నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
సముద్ర తీరంలో వింత పదార్థం.! మిస్టరీగా మారిన పిండిముద్ద ఆకారం..
సముద్ర తీరంలో వింత పదార్థం.! మిస్టరీగా మారిన పిండిముద్ద ఆకారం..
ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండం
ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండం
న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?
న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?