నిద్ర పట్టడంలేదా? రోజూ కాసిన్ని గుమ్మడి గింజలు తిన్నారంటే..
15 October 2024
TV9 Telugu
TV9 Telugu
క్యారెట్లు, చిలగడ దుంపల్లో మాదిరిగానే గుమ్మడికాయలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీటా కెరొటిన్ దండిగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసే ఇది ఒంట్లోకి చేరుకున్నాక విటమిన్ ఎ రూపంలోకి మారిపోతుంది
TV9 Telugu
అయితే చాలా మందికి గుమ్మడి కాయ తింటే మంచిదని తెలుసు గానీ, అందులోని గింజలకూ ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే విషయం చాలామందికి తెలియదు
TV9 Telugu
గుమ్మడి గింజల్లో ఫైబర్ ఎక్కువ. జీర్ణసంబంధిత సమస్యలూ, అధికబరువు... వంటివాటితో బాధపడేవారు రోజూ ఓ చెంచా గింజల్ని తినండి. వీటిని కొద్దిగా తిన్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది
TV9 Telugu
ఇది అతిగా ఆహారం తినే అలవాటుని నియంత్రిస్తుంది. ఫలితంగా బరువూ తగ్గుతారు. అలానే జీర్ణ ప్రక్రియనూ మెరుగుపరుస్తుంది
TV9 Telugu
ఈ గింజల్లోని కెరొటినాయిడ్లు, విటమిన్-ఇ, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ముఖ్యంగా జీర్ణాశయం, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాలను అడ్డుకుంటాయి
TV9 Telugu
యాంటీ డయాబెటిక్ లక్షణాలు గుమ్మడి గింజల్లో ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో ఉండే ట్రైగోనిలైన్, నికోటినిక్ యాసిడ్, డి-కైరో-ఐనాసిటాల్ అనే సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయులు హెచ్చుతగ్గులకు లోనుకాకుండా చేస్తాయి
థైరాయిడ్ హార్మోను ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది. ప్రొటీన్ తగినంతగా లభించడం వల్ల కండరాలూ ఆరోగ్యంగా ఉంటాయి. నిస్సత్తువ దరిచేరదు. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్, మెగ్నీషియం, జింక్‌లు మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. దాంతో హాయిగా నిద్రపోగలరు