రోజుకు 2 ఖర్జూరం తినండి.. అందం తో పాటు అనేక ప్రయోజనాలు మీ సొంతం

Phani CH

16 October 2024

ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో ప్రజలు ఆరోగ్యం, ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.. ఆహార నియంత్రణను కూడా చేసుకుంటున్నారు.

అయితే హెల్త్‌ డైట్‌లో భాగంగా చాలా మంది ఖర్జూరాన్ని ఆహారంలో ఉపయోగిస్తారు. అయితే ఖర్జూరం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి రోజు ఖర్జూరం తినడం వల్ల ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఒక అధ్యయనం ప్రకారం, ఖర్జూరంలో సెలీనియం, క్యాల్షియంతో సహా 15 మినరల్స్‌ ఉన్నాయి. ఇవి క్యాన్సర్‌ కణాలతో పోరాడతాయి, ఇమ్యూనిటీని పెంచుతాయి.

ఖర్జూరంలో 23 అమైనో యాసిడ్స్‌, పాల్మిటోలిక్‌, ఒలీక్, లినోలెయిక్, లినోలెనిక్ యాసిడ్‌‌‌‌ వంటి అసంతృప్త ఫ్యాటీ యాసిడ్స్‌ ఉన్నాయి. ఖర్జూరం గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.

ఖర్జూరం మలబద్ధకం, జీవక్రియ, అధిక బరువు మొదలైన సమస్యలు దరిచేరవు. అంతే కాకుండ ఇది అనేక రకాల వ్యాధులు నయం చేసేలా చేస్తుంది.

ఖర్జూర పండ్లను ఉదయాన్నే తింటే శక్తి లభిస్తుంది. దీని వల్ల పేగు పురుగులు కూడా చనిపోతాయి. గుండె, కాలేయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 

ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ముఖ కాంతిని పెంచడంతో పాటు జుట్టు ఆయుష్షును కూడా పెంచుతుంది. ఇది అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది.

రోజుకు 2 ఖర్జూరాలు మాత్రం తింటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మంచి రిజల్ట్స్‌ కోసం వారం పాటు క్రమం తప్పకుండా తినాలని అంటున్నారు.