
శరీరం ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే.. ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. సమతుల్యమైన ఆహారం తీసుకుంటేనే.. ఎన్నో వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. కేవలం పండ్లు, కూరగాయలు తీసుకుంటే సరిపోదు. కొన్ని ప్రత్యేకమైన విత్తనాలు, నట్స్ కూడా ఆరోగ్యంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి. వీటిల్లో సబ్జా విత్తనాలు కూడా ఒకటి. సబ్జా విత్తనాలతో మీరు ఎంతో ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. సబ్జా గింజల్ని తులసి విత్తనాలు అని కూడా పిలుస్తారు. ఇవి చూడటానికి చియా సీడ్స్‌లా ఉంటాయి. కానీ ఇవి పూర్తిగా నలుపు రంగులోనే ఉంటాయి. సబ్జా సీడ్స్‌ని జ్యూసులు, సలాడ్స్, స్మూతీలు, షేక్స్, డిజర్ట్స్ ఇలా వేటిలో అయినా తీసుకోవచ్చు. అయితే వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవాలి. సబ్జా గింజల్లో కూడా చాలా రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
సబ్జా గింజలు తీసుకోవడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. వీటిని నీటితో కలిపి తీసుకోవడం వల్ల కేలరీలు కరుగుతాయి. వీటిల్లో కూడా కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు.
డయాబెటీస్ ఉన్నవారు ఏం తినాలన్నా.. తాగాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. తినడానికి కూడా సంకోచిస్తూ ఉంటారు. కానీ సబ్జా సీడ్స్‌ని ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. వీటిల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. టైప్ – 2 డయాబెటీస్ ఉన్నవారికి సబ్జా గింజలు తీసుకోవడం వల్ల.. రక్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ చాలా వరకు తగ్గుతుంది.
సబ్జా గింజల్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ క్రియకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఇవి తీసుకోవడం వల్ల మలబద్ధకం, అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ గింజలు సమ్మర్‌లో తీసుకుంటే పొట్టను చల్ల బరుస్తుంది.
వెయిట్ లాస్ అయ్యేందుకు సబ్జా గింజలు చక్కగా పని చేస్తాయి. వీటిని అప్పుడపుడూ తీసుకోవడం వల్ల ఆకలి అనేది తగ్గుతుంది. వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. ఈ విత్తనాల్లో ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగు పరిచి.. బరువు పెరగడాన్ని తగ్గిస్తుంది.
తరచూ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే సబ్జా గింజలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా అందుతుంది. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..