Egg Yolks: గుడ్డులోని పచ్చసొన తింటే ఏమవుతుంది? ఆరోగ్యానికి మంచిదేనా?

గుడ్లు అత్యంత పోషకమైన ఆహారం. అందుకే చాలా మంది ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌గా వీటిని తీసుకుంటూ ఉంటారు. ఆహారంలో గుడ్లను చేర్చుకోవడం, వాటిని రోజూ తినడం చాలా ఆరోగ్యకరమైన ఎంపిక. అయితే చాలా మంది మొత్తం గుడ్లను తినరు. గుడ్డులోని పచ్చసొన భాగాన్ని తినకుండా ఉంటారు. ఎందుకంటే ఇందులో కొవ్వు, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం..

Egg Yolks: గుడ్డులోని పచ్చసొన తింటే ఏమవుతుంది? ఆరోగ్యానికి మంచిదేనా?
Egg Yolks

Updated on: Nov 24, 2025 | 8:30 PM

గుడ్లు అత్యంత పోషకమైన ఆహారం. అందుకే చాలా మంది ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌గా వీటిని తీసుకుంటూ ఉంటారు. ఆహారంలో గుడ్లను చేర్చుకోవడం, వాటిని రోజూ తినడం చాలా ఆరోగ్యకరమైన ఎంపిక. అయితే చాలా మంది మొత్తం గుడ్లను తినరు. గుడ్డులోని పచ్చసొన భాగాన్ని తినకుండా ఉంటారు. ఎందుకంటే ఇందులో కొవ్వు, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుడ్డులోని పచ్చసొన శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుందని, బరువు పెంచుతుందని భావిస్తారు. అందుకే దీనిని నివారించాలి. అయితే దీని వెనుక ఉన్న నిజం ఏమిటో? అసలు గుడ్డులోని పచ్చసొన తినాలా వద్దా? గుడ్డులోని పచ్చసొన తినడం ఆరోగ్యకరమా లేదా హానికరమా? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

గుడ్డు పచ్చసొనలో గుండెకు అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు, మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో మంచి మొత్తంలో ప్రోటీన్‌తో పాటు గుడ్డు పచ్చసొనలో ఒమేగా-3 ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండెకు ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులను అందిస్తాయి. గుడ్డులోని పచ్చసొనలో రిబోఫ్లేవిన్, విటమిన్లు, విటమిన్ బి-12 వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో ఐరన్‌ కూడా ఉంటుంది. అందువల్ల మీరు గుడ్డులోని పచ్చసొనను తొలగిస్తే, శరీరానికి ఈ పోషకాలు అందకుండా నివారించినట్లు అవుతుంది.

అంతేకాకుండా గుడ్డు పచ్చసొనలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది శరీరానికి టెస్టోస్టెరాన్ ఉత్పత్తి కావడానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. ఇది శక్తి స్థాయిలను పెంచడానికి, కండరాలను నిర్మించడానికి సహాయపడుతుంది. ఒక గుడ్డులో దాదాపు 186 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది పచ్చసొనలో మాత్రమే కనిపిస్తుంది. గుడ్డులోని పచ్చసొనలోని కొవ్వు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే గుడ్డు తినే ముందు మీ పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. వీరు సూచనల మేరకు మాత్రమే గుడ్డు పచ్చసొన తినడం బెటర్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి