Black Powder on Onions: నల్ల మచ్చలున్న ఉల్లిపాయలు తింటే జరిగేది ఇదే.. మస్ట్‌గా తెలుసుకోండి
ఉల్లిపాయలు లేని భారతీయుల వంట ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఉల్లిపాయ లేనిదే ఏ వంట పూర్తి కాదు. ఆహారానికి రుచిని ఇవ్వడమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తాయి. పచ్చి ఉల్లిపాయలను తినడం వలన షుగర్ వ్యాధి నివారించవచ్చు అని నిపుణులు కూడా సూచిస్తారు. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలను ఉల్లి పాయ తాజా ఉన్నంత వరకూ మాత్రమే ఇస్తాయి. ఈ నేపధ్యంలో నల్లటి మచ్చలున్న ఉల్లిపాయలను తినడం సురక్షితమేనా నిపుణులు చెప్పిన సలహా ఏమిటంటే..

భారతీయుల వంట గదిలో ఉల్లిపాయలకు ప్రధాన స్థానం ఉంది. ఉల్లిపాయలు లేనిదే కూరను చేసుకోరు. ఎందుకంటే ఉల్లిపాయలు వంటలకు మంచి రుచి, సువాసనను జోడిస్తాయి. అంతేకాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఉల్లిపాయలను తినడం వలన జీర్ణవ్యవస్థ, గుండె ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. అందానికి కూడా ఉల్లి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఒకొక్కసారి ఉల్లిపాయలపై నల్ల మచ్చలు కనిపిస్తాయి. అటువంటి ఉల్లిపాయలను తొక్కలు తీసి.. శుభ్రం చేసి తిరిగి ఉపయోగిస్తాయి. అయితే ఇలా నల్లమచ్చలున్న ఉల్లిపాయలను తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఉల్లిపాయపై నల్లటి, దుమ్ము లాంటి పొడి మచ్చలు ఉంటే.. వాటిని బయట పడేయాలా? లేకా శుభ్రం చేసి ఉపయోగించవచ్చా.. అనే విషయంపై పోషకార నిపుణులు ఏమి చెప్పారంటే
ఉల్లిపాయల మీద నల్ల మచ్చ ఉంటే ఆ మచ్చలు ఆస్పెర్‌గిల్లస్ నైగర్ అనే ఫంగస్ వలన వస్తాయి. ఈ రకమైన ఫంగస్ మట్టిలో కనిపిస్తుంది. ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణంలో తక్కువ వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో ఉల్లిపాయలను నిల్వ చేస్తే వాటిపై ఈ ఫంగస్ కనిపించడం సర్వసాధారణం. ఈ ఫంగస్ ఆందోళనకరం కాదు. అయితే తినే విషయంలో ఆరోగ్యం, ఉల్లిపాయ పరిస్థితితో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి.
నల్లటి పొడి ఎందుకు వస్తుంది? ఆస్పెర్‌గిల్లస్ నైగర్ వెచ్చని, తేమతో కూడిన పరిస్థితులలో బాగా పెరుగుతుంది. ఉల్లిపాయలను తడిగా లేదా గాలి సరిగా లేని ప్రదేశాలలో అంటే బస్తాలు లేదా మూసి ఉన్న కంటైనర్లలో నిల్వ చేసినప్పుడు, ఫంగస్ బయటి పొరలపై పెరగడం ప్రారంభించి, నల్లటి పొడి అవశేషాలను ఏర్పరుస్తుంది. ఉల్లిపాయల బయటి చర్మం దెబ్బతిన్నట్లయితే ఇలా నల్లటి మచ్చలు సంభవించే అవకాశం ఉంది.
తినడానికి సురక్షితమేనా? ఉల్లిపయలపై ఉన్న ఈ నల్లటి మచ్చలు మ్యూకోర్మైకోసిస్ కాదు. కనుక ఎటువంటి ఆరోగ్య సమస్య లేని వ్యక్తులు ఇటువంటి ఉల్లిపాయలను శుభ్రం చేసుకుని ఫంగల్ ఉన్న పొరలు తీసి ఉపయోగించవచ్చు. ఇటువంటి ఉల్లిపాయలను వండడానికి ముందు తొక్క తీసి.. బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు ఆరోగ్యానికి ఎటువంటి హానిని కలిగించే అవకాశం లేదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అయితే ఈ బ్లాక్ అచ్చు ఒక రకమైన టాక్సిన్‌ను విడుదల చేస్తుందని పరిశోధనలో తేలింది. ప్రాణాపాయం కానప్పటికీ వీటిని రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు, ఉబ్బసం లేదా ఇతర శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అలెర్జీ , శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇటువంటి ఉల్లిపాయలను తినడం వలన ఈ సమస్య మరింత అధికం అవుతుంది. కనుక ఈ ఆరోగ్య సమస్యలున్నవారు నల్లటి మచ్చలున్న ఉల్లిపాయలను తినదకుండా దూరంగా ఉండడం మంచిది.
ఉల్లిపాయను ఎప్పుడు పారవేయాలి? లోపలి పొరలు బూజు, కుళ్ళు లేదా దుర్వాసనను చూపిస్తే వెంటనే ఆ ఉల్లిపాయలను పారవేయండి. ఉల్లిపాయ మృదువుగా, తడిగా లేదా జిగటగా అనిపిస్తే.. అటువంటి ఉల్లిపాయని తినడం సురక్షితం కాదు. ఉల్లిపాయ లోపల పూర్తిగా ఎండిపోయి, బయటి నుంచి నల్లటి పొడి ఉల్లిపాయలను వెంటనే తీసి పరవేయండి.
చిట్కా: ఉల్లిపాయలను ఇంట్లో నిల్వ చేయాలనుకుంటే ఉల్లిపాయలను ఎల్లప్పుడూ చల్లని, పొడి, బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో నిల్వ చేయండి.
ఉల్లిపాయలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసే అలవాటు ఉంటే.. మచ్చలున్న ఉల్లిపాయలను పొరపాటున కూడా ఫ్రిడ్జ్ లో పెట్టవద్దు. ఈ ఫంగస్ ఫ్రిడ్జ్ లోని ఇతర ఆహార పదార్థాలతో కలిసి ఆహారాన్ని విషంగా మారుస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








