Jagan Ramadan wishes : ముస్లింలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి “ఈద్ ముబారక్”
Ramadan wishes : ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు(ఈద్ ముబారక్) తెలిపారు...

Ramadan wishes : ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు(ఈద్ ముబారక్) తెలిపారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని, కరోనా మహమ్మారి నుంచి బయట పడి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని జగన్ పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదరసోదరీమణులంతా నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో నిష్ఠగా అల్లాహ్ ను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. అల్లాహ్ రక్షణ, కరుణ పొందాలనే లక్ష్యంతో రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ, బీద, ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్నదానిలో ఎంతోకొంత దానధర్మాలు చేస్తూ సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని జగన్ అన్నారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
Read also : #AskKTRలో ఆసక్తికర సంభాషణలు, మీరు ఎలా కొవిడ్ ను ఎదుర్కొన్నారన్న ప్రశ్నకు కేటీఆర్ ఫుల్ క్లారిటీ