Anger Management: ప్రతి చిన్నదానికి కోపం వస్తోందా? ఇలా కంట్రోల్ చేసుకోండి..!
ప్రతి మనిషికి రకరకాల భావోద్వేగాలు ఉంటాయి. వాటిల్లో కోపం ఒకటి. ఈ కోపం మనిషిని రాక్షసుడిలా మారుస్తుంది. కొందరికి అదే పనిగా కోపం వస్తుంటుంది. ముఖ్యంగా టీనేజర్లలో ఓపిక, సహనం ఉండదు. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు. యుక్త వయస్కులు చిరాకుగా, కోపంగా ఉండటానికి కారణం వారి శరీరంలో నిరంతరం హార్మోన్లు మార్పులకు గురవడమే.

ప్రతి మనిషికి రకరకాల భావోద్వేగాలు ఉంటాయి. వాటిల్లో కోపం ఒకటి. ఈ కోపం మనిషిని రాక్షసుడిలా మారుస్తుంది. కొందరికి అదే పనిగా కోపం వస్తుంటుంది. ముఖ్యంగా టీనేజర్లలో ఓపిక, సహనం ఉండదు. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు. యుక్త వయస్కులు చిరాకుగా, కోపంగా ఉండటానికి కారణం వారి శరీరంలో నిరంతరం హార్మోన్లు మార్పులకు గురవడమే. అందుకే.. వారు ప్రతి చిన్న అంశానికి కూడా కోపంగా ఉంటారు. కోపం అనేది ఒక సాధారణ ప్రతిచర్య, భావోద్వేగం. అయితే, ఆ కోపం అనేది మితిమీరితేనే అనేక అనర్థాలకు దారితీస్తుంది. మరి కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇందుకోసం ఉన్న మార్గాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కోపాన్ని కంట్రోల్ చేసుకునే టిప్స్..
కోపానికి కారణం ఏంటో గ్రహించాలి: ఒక వ్యక్తికి నిర్దిష్ట పరిస్థితి కారణంగా కోపం వస్తుంటుంది. ఆందోళన, ఆకలి, దుఃఖం, అలసట, భయం అన్నీ వేర్వేరు భావోద్వేగాలు అయినప్పటికీ, కోపానికి వీటికి కొంత సంబంధం ఉంటుంది. మీరు కోపంగా ఉన్నట్లయితే.. ఎలా అనుభూతి చెందుతున్నారు? సరిగ్గా తిన్నారా? రాత్రి బాగా నిద్రపోయారా? ఈ విషయాలన్నీ విశ్లేషించుకోవాలి. ఇలా మీ కోపాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి.
సానుకూలంగా ఆలోచించాలి: కోపంలో ఆలోచనలను నియంత్రించలేరు. ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. అందుకే కోపం వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు సానుకూలంగా ఆలోచించడం చాలా ముఖ్యం. సానుకూల ఆలోచనలను పెంపొందించుకోవాలి. మీతో ఓ పాకెట్ డైరీని ఉంచుకోండి. తద్వారా ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు.. ఆ డైరీని చదవడం, రాయడం ద్వారా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.




రిలాక్స్ అయ్యేందుకు ప్రాక్టీస్: మీ కోపం అదుపు తప్పుతున్నట్లయితే, మీరు శారీరకంగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి. శరీరం రిలాక్స్‌గా ఉన్నప్పుడు భావోద్వేగాలపై నియంత్రణ పొందవచ్చు. ధ్యానం చేయడం ద్వారా విశ్రాంతి తీసుకోవడమే కాకుండా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. అలా కోపాన్ని కూడా నియంత్రించుకోవచ్చు.
శారీరక వ్యాయామం చేయండి: వ్యాయామం చేసిన తర్వాత మనం మానసిక ప్రశాంతత కలుగుతుంది. వ్యాయామం వల్ల ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. రోజూ వ్యాయామం చేస్తే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
సంగీతం వినండి: మంచి సంగీతం మీ కోపం, మీ మనస్సు రెండింటినీ ప్రశాంతపరుస్తుంది. సంగీతం విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. మీకు కోపం వచ్చినప్పుడు, పరిస్థితిని సాధారణీకరించడానికి సంగీతం వినండి. మీకు మంచి అనుభూతిని కలిగించే సంగీతాన్ని వినడం ద్వారా మీరు, మీ మనస్సును రిలాక్స్ చేసుకోవచ్చు.
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి?: సాధారణం కంటే ఎక్కువ కోపంగా ఉంటే.. అలర్ట్ అవ్వాల్సిందే. మీ కోసం హింసాత్మకంగా మారుతున్నట్లయితే.. వెంటనే మానసిక వైద్యుల సహాయం తీసుకోవాలి. తద్వారా అవసరమైన చికిత్స పొందవచ్చు.
మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




