
కిచెన్ నుంచి బాత్రూమ్, అల్మారా, చివరకు బెడ్ రూంలో కూడా ఎక్కడ పడితే అక్కడ బొద్దింకలు దర్శనమిస్తూ ఉంటాయి. నిజానికి.. ఎక్కడ తేమ, ఆహార వాసన ఉంటుందో అక్కడ బొద్దింకలు తమ నివాసంగా మారడానికి ఇష్టపడతాయి. మార్కెట్లో వివిధ స్ప్రేలు, రసాయనాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి ఎంతో ఖరీదైనవి. పైగా వీటిని వాడటం వల్ల కుటుంబంలోని పిల్లలు, పెంపుడు జంతువులకు కూడా హానికరం కావచ్చు. అయితే ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లోనే సహాజ పద్ధతుల్లో బొద్దింకలకు చెక్ పెట్టొచ్చు. ఎలాగంటే..
బేకింగ్ సోడా – చక్కెరను సమాన పరిమాణంలో కలిపి ఒక మూలలో ఉంచాలి. చక్కెర ఈగలను ఆకర్షిస్తుంది. బేకింగ్ సోడా విషంగా పనిచేస్తుంది.
వంటగది డ్రాయర్లు, అల్మారాలు, పప్పు డబ్బాలలో కొన్ని లవంగాలను ఉంచాలి. బొద్దింకలు లవంగాల వాసనను తట్టుకోలేవు.
వేప ఆకులను నీటితో కలిపి పిచికారీ చేయడం లేదా కొన్ని చుక్కల వేప నూనెను నేలపై రుద్దడం వల్ల కూడా బొద్దింకలు దూరంగా ఉంటాయి.
తాజా దోసకాయ తొక్కలు బొద్దింకలకు ఇష్టం ఉండవు. ఆ తొక్కలను వంటగది సింక్ లేదా మూలలో వదిలేస్తే అవి పారిపోతాయి.
రాత్రిపూట నేలపై కొంత బోరిక్ పౌడర్ చల్లి ఉంచాలి. కానీ పిల్లలు, పెంపుడు జంతువులకు అందుబాటులో లేకుండా జాగ్రత్తగా ఉంచాలన్న విషయం మర్చిపోకూడదు.
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, మురికి పాత్రలను ఉంచకుండా ఉండటం, మురుగు కాలువలను కప్పి ఉంచడం వల్ల బొద్దింకల సమస్య తలెత్తదు. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటించడం వల్ల బొద్దింకల బెడద చాలా వరకు తగ్గుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.